ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ట్రెండ్ గా మారింది..: అఖిలేష్ యాదవ్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు.ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ట్రెండ్ గా మారిందని విమర్శించారు.

అధికారంలోకి రానివారిని జైలులో పెట్టడం నిరంకుశ పాలకుల విధానమని అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు.

అయితే ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదన్నారు.రాజకీయాల్లోకి ఇలాంటి చర్యలకు భారీ మూల్యం తప్పదని పేర్కొన్నారు.

స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదంటూ చంద్రబాబును టాగ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.

రూ.2 కోట్ల సాయంతో బన్నీపై కోపం తగ్గినట్టేనా.. ఆ కేసు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందా?