అర్ధరాత్రి టీడీపీ అయ్యన్న అరెస్ట్ ! ఏ కేసులో అంటే…?

జగన్ పైన , వైసిపి ప్రభుత్వం పైన ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే మాజీ మంత్రి,  టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడుని ఈరోజు అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే అయ్యన్న అరెస్టు విషయం బయటకు పొక్కకుండా చాలా పగడ్బందీ జాగ్రత్తలు తీసుకుని మరి ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గత కొంతకాలంగా వైసిపి ప్రభుత్వం పైన, జగన్ పైన అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

అభ్యంతర పదజాలంతో బహిరంగంగానే విమర్శిస్తున్నారు.దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు గతంలోనే పోలీసులు అనేకసార్లు ప్రయత్నాలు చేశారు.

అయితే కోర్టులో ముందస్తు బైయిల్ తెచ్చుకోవడం తదితర కారణాలతో అయ్యన్న అరెస్టు నుంచి తప్పించుకుంటూ వచ్చారు.

అయితే కోర్టుకు సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతోనే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సమాచారం.

అయితే అయ్యన్న అరెస్టు విషయం ముందే బయటకు తెలిస్తే పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు ఆయనను అరెస్టు చేయనీయకుండా అడ్డుపడతారని,  అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడతాయనే ఉద్దేశంతో సిఐడి పోలీసులు అకస్మాత్తుగా అయ్యన్న అరెస్టును చేపట్టారు.

  అరెస్టుకు ముందు అయ్యన్న నివాసం సమీపంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ను నిలిపివేశారు.

అయ్యన్న ఇంట్లోనే ఉన్నారని పక్కా సమాచారంతో సిఐడి పోలీసు వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు.

అయ్యన్నపాత్రుడు తో పాటు,  ఆయన కుమారుడు రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒక కాలువను ఆక్రమించి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడను నిర్మించారని గతంలోని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఆ తర్వాత గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.  """/"/ దీనిపై అయ్యన్న కోర్టును ఆశ్రయించారు.

అయితే కోర్టుకు సమర్పించిన పత్రాలు నకిలీవని రాజమండ్రి సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు.

అయ్యన్నను ఆయన కుమారుడుని అరెస్ట్ చేస్తున్నట్లుగా సిఐడి పోలీసులు కుటుంబ సభ్యులకు నోటీసులు అందించారు.

అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ పై నాన్ బేలబుల్ కేసులు నమోదైనట్లు సమాచారం.

అయితే అయ్యన్నపాత్రుడు అరెస్టుపై టిడిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.అయ్యన్న అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేపట్టేందుకు టిడిపి సిద్ధమవుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, శుక్రవారం 2024