నగదును రెట్టింపు చేస్తామని మోసం చేసిన బీహారీ ముఠా అరెస్ట్…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:నగదును రెట్టింపు చేస్తామని నమ్మించి,వారి వద్ద నుండి అసలు కరెన్సీ నోట్లను తీసుకొని,మధ్యలో తెల్ల కాగితాలు పైన కింద ఒరిజినల్ కరెన్సీ నోట్లు పెట్టిన నోట్ల కట్టలు అప్పగించి ఉడాయించే ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు రెండు రోజుల్లో పట్టుకొని కటకటాల వెనక్కి పంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వెల్లడించిన వివరాల ప్రకారం.
ఈ నెల 22 న నల్లగొండ రూరల్ మండలం చందనపల్లి గ్రామంలోని ఆర్‌ఎంపి శ్రీరామోజు రామాచారి ఇంటికి వెళ్ళిన బిహార్ రాష్ట్రానికి చెందిన షేక్ శిరాజ్,రాం నరేష్ యాదవ్ ముఠా మా దగ్గర డబ్బులను రెట్టింపు చేసే లిక్విడ్ ఉందని,మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నచో వాటిని రెట్టింపు చేసి ఇస్తామని ఆశ చూపించి ఆర్ఎంపి అతని బావమరిదిని నమ్మించగా, వారి మాటలను నమ్మి రూ.
33 లక్షలకు అప్పగించారు.వాటిని తమ దగ్గర కలర్ లో ముంచి రూ.
500 కరెన్సీ నోట్లను పైన కింద పెట్టి,మధ్యలో తెల్ల కాగితాలను పెట్టిన బండిల్స్ కట్టారు.
ఇవి మారడానికి సమయం పడుతుందని,వాటికి సంబంధించిన ముద్ర కొరకు హైదారాబాద్ వెళుతున్నామని చెప్పి వారి కళ్ళు కప్పి అసలు కరెన్సీతో పారిపోయారు.
మోసపోయాయని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాలతో నల్గొండ డిఎస్పీ కె.
శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ టూ టౌన్ సిఐ బి.డానియెల్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ రూరల్ ఎస్ఐ జె.
శివకుమార్, కానిస్టేబుల్స్ తిరుమలేష్, జానకిరాములు,హోంగార్డ్ సలీం బృందంగా ఏర్పడి దర్యాప్తు చేస్తుండగా నల్గొండ రైల్వే స్టేషన్ లో బీహార్ పారిపోవుటకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి,వారి వద్ద ఉన్న బ్యాగ్ ను చెక్ చేయగా,డబ్బుల కట్టలు కనిపించడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.
రెండు రోజుల్లో కేసును ఛేదించి, నేరానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేయాగా,మూడవ వ్యక్తి షేక్ ఆఫ్తాబ్ రూ.
9 లక్షల నగదుతో పరారీలో ఉన్నాడు.వారి వద్ధ నుండి రూ.
24 లక్షల నగదు,3 సెల్ ఫోన్లు,నోట్ల తయారికి వాడే రంగు సీసాలు,ఇతర సామగ్రి,తెల్లని కాగితాలు కలిగిన నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు.
కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
నిద్రపోతూనే డ్రైవింగ్.. వెస్ట్ బెంగాల్ వ్యక్తి రూపొందించిన బెడ్ కారు అదుర్స్..