గంజాయి కి అలవాటు పడ్డ ఇద్దరు యువకుల అరెస్ట్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి తాగుతున్న నమ్మదగిన సమాచారం మేరకు వెళ్లగా అక్కడ కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన చిట్కూరి ఈశ్వర్, చందుర్తి మండలం ఆశీరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చీకుంట గణేష్ లు ఇరువురు పట్టుబడగా వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు.
యువత డ్రగ్స్ భారిన పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని,జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు.
భారత్‌పై ఆంక్షల దిశగా కెనడా.. మద్ధతు పలికిన భారత సంతతి నేత !!