తెలంగాణ కాంగ్రెస్ కు కలిసి వస్తున్న చంద్రబాబు అరెస్ట్ 

తెలంగాణ లో కాంగ్రెస్ కు రోజురోజుకు బలం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది.ముఖ్యంగా ఓ ప్రధాన సామాజిక వర్గం కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీకి బాగా కలిసి వస్తోంది.

టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఏపీ సిఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ అరెస్టు వెనుక కేంద్ర బిజెపి పెద్దల హస్తం ఉందని,  కమ్మ సామాజిక వర్గం నమ్ముతోంది .

ఇక ఏపీ సీఎం జగన్ కు కేసిఆర్ అత్యంత సన్నిహితుడు కావడంతో బిజెపి ఆగ్రహంగా ఉందని, అందుకే ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై ఆ సామాజిక వర్గం కీలక నిర్ణయం తీసుకుందని , కాంగ్రెస్ వైపే ఉండాలని నిర్ణయించుకోవడంతో ,అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) కు బలం పెరిగినట్లు అయింది.

"""/" / అంతే కాకుండా , కాంగ్రెస్ సైతం కమ్మ సామాజిక వర్గానికి ఎప్పుడూ లేనంతగా ప్రాధాన్యం ఇవ్వడం, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Tummala Nageswara Rao ), మండవ వెంకటేశ్వరరావు వంటి కీలక నేతలను పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇవ్వడం , హైదరాబాద్ తో పాటు , ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండడం,  అక్కడ గెలుపోవటములను ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండడం , ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయి.

దీనికి తగ్గట్లుగానే కాంగ్రెస్ కూడా ఆ సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది.

గతంలో టిడిపిలో యాక్టివ్ గా పనిచేసిన కమ్మ సామాజిక వర్గం నాయకులను పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇస్తూ వారి ప్రాధాన్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుండడం ఇవన్నీ కలిసి వస్తున్నాయి.

"""/" / ఇదే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) టిడిపి అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల కావడం కూడా తెలంగాణ కాంగ్రెస్కు కలిసి వస్తోంది.

ఈ పరిణామాలతో బీ,  బిజెపి లకు ఆందోళన కలిగిస్తున్నాయి.కమ్మ సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతు పలికితే,  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాలతో పాటు,  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయము ఆ రెండు పార్టీల్లో నెలకొంది.

.

‘మన హక్కు హైదరాబాద్’ అంటూ కర్టెన్ రైజర్ ప్రచార గీతం..