ప్రజాపాలనలో ఏర్పాట్లు సరిగా లేవు..: ఎమ్మెల్యే రాజాసింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజాపాలనలో ఏర్పాట్లు సరిగా లేవని తెలిపారు.దరఖాస్తు పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.

దరఖాస్తు పత్రాలు మీ -సేవలో విక్రయిస్తున్నారన్న ఆయన వీటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే అభయహస్తం పథకాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.

కాగా ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగనుంది.

బాబు స్పీడ్ కి బ్రేకులు : ‘ఉచిత బస్సు ‘ ఇప్పట్లో లేనట్టేనా ?