శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. శ్రీరామనవమి ఎప్పుడు తెలుసా..

స్వస్తిశ్రీ చంద్రమాన శుభకృత్‌ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మార్చి 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు భద్రాద్రి రామాలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరగనున్నాయి.

వీటిలో భాగంగా మార్చి 30వ తేదీన శ్రీ స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని దేవాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

అంతే కాకుండా 12 సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే శ్రీ స్వామివారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసామని కూడా తెలిపారు.

దేవాలయ కల్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో విద్యుద్దీకరణ ఏర్పాటు కోసం దాదాపు 18 లక్షల రూపాయలు, రుత్వికులకు బహకరించినందుకు రుత్విక్‌ సంభావనలు దాదాపు పది లక్షల రూపాయలను ఖర్చు చేయనున్నారు.

"""/"/ ఇంకా చెప్పాలంటే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక హోమాలు, యాగాలు చేసే వేద పారాయణదారులకు భోజన వసతి కోసం పది లక్షల రూపాయలను, శ్రీవారికి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ కోసం 8 లక్షల రూపాయలను, దేవాలయ మండపంలో పూజ అలంకరణ కోసం 8 లక్షల రూపాయలు, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం సందర్భంగా యాగశాల ఏర్పాటుకు ఐదు లక్షలు ఖర్చు చేయనున్నారు.

శ్రీరామనవమి పట్టాభిషేకం రెండు రోజులు భక్తులకు అన్న ప్రసాద వితరణ కోసం ఐదు లక్షలు, చలవ పందిళ్ల ఏర్పాటుల కోసం నాలుగు లక్షలు, పది రోజుల పాటు హోమ ద్రవ్యాల కోసం మూడు లక్షలు, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం 12 నది జలాల సేకరణ కోసం ఒక్కొక్క నది జలం కోసం 12,000 చొప్పున ఒక లక్షా నలభై నాలుగువేల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.

రాజమౌళి మహేష్ బాబు తో చేయబోయే సినిమాలో ఆర్టిస్టులెవరో తెలుసా..?