ఏపీలో కౌంటింగ్ కు ఏర్పాట్లు.. భారీగా కేంద్ర బలగాల మోహరింపు
TeluguStop.com
ఏపీలో ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం( Election Commission ) భారీగా ఏర్పాట్లు చేస్తుంది.
ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించింది.కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో అల్లర్లు చోటు చేసుకునే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు.
అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించిన ఎన్నికల సంఘం అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసులతో చర్చలు జరుపుతున్నారు.
కాగా ఏపీలో జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్( Election Counting ) జరగనున్న సంగతి తెలిసిందే.