రైతుల సహకారంతో మైసమ్మ పండగ నిర్వహణకు ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రస్తుతం యాసంగి సీజన్ వరి పంటలు కోతకు వస్తున్న దృష్ట్యా ప్రతి ఏటా మాదిరిగా ఎల్లారెడ్డి పేట కు సాగు నీటిని అందించే సింగ సముద్రం వద్ద గల మైసమ్మ కు మొక్కులు చెల్లించుకోవాలని రైతులు స్థానిక సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశంలో రైతులు సమిష్టి నిర్ణయం తీసుకున్నారు.

మైసమ్మ పండగ నిర్వహణకు ప్రతి ఎకరాన రెండు వందల రూపాయలు పోగు చేసుకుని మైసమ్మ పండగ ఈ నెల చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో చేయాలని నిర్ణయించినట్లు ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతులు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కమిటీ మాజీ చైర్మన్ మేగి నర్సయ్య పాల్గొన్నారు.

ఈ ఇద్దరు హీరోయిన్స్ నటించిన ఒక్క సినిమాతోనే ప్రేమించిన హీరోని పెళ్లి చేసుకున్నారు ..!