మృతదేహాలను రేపు ఢిల్లీకి తరలించనున్న ఆర్మీ అధికారులు..!!

భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తో పాటు.ఆయన భార్య .

ఇంకా 11 మంది సైనికులు మొత్తం 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తెలిసిందే.

ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు భారీగా నెలకొని ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడానికి ప్రధాన కారణం పొగమంచు అని ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా గత మూడు రోజుల నుంచి ఇదే మార్గంలో ట్రయల్ రన్.కూడా వేసినట్లు.

విచారణలో తెలుసుకున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే హెలికాప్టర్ నంజప్పన్ క్షత్తిరం గ్రామంలో.

కాలిపోతూ కుప్పకూలిపోయినట్టు ప్రత్యక్షసాక్షి చెప్పటం జరిగింది.సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ఈ సంఘటన జరిగినట్లు ప్రత్యక్షసాక్షి తెలపడం జరిగింది.

14 మందితో బయలుదేరిన చాపర్.13 మంది మరణించటంతో ఒకరికి  తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం మరణించిన 13 మృతదేహాలను వెల్లింగ్టన్ బేస్ క్యాంపు లో ఉంచారు.

రేపు ఢిల్లీకి తరలించడానికి ఆర్మీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.సైనిక లాంఛనాలతో మృతదేహాలకు రేపు ఢిల్లీలో కేంద్ర పెద్దలతో పాటు ఆర్మీ ఉన్నత అధికారులు నివాళులు అర్పించనున్నారు.

Tollywood Hit Movies : కేవలం ఆ ఒక్క కారణంగానే సూపర్ డూపర్ హిట్టైన టాలీవుడ్ సినిమాలు !