అవార్డుతో శివ కార్తికేయన్ ను సత్కరించిన ఆర్మీ అధికారులు.. ఈ హీరో రియల్లీ గ్రేట్!
TeluguStop.com
తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్( Siva Karthikeyan ) ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు శివ కార్తికేయన్.
అందులో భాగంగానే శివకార్తికేయన్, నటి సాయి పల్లవి( Sai Pallavi ) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అమరన్.
( Amaran ) ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దివంగత సైనికుడు మేజర్ ముకుంద వరదరాజన్( Major Mukunda Varadarajan ) సైనిక జీవితం, పర్సనల్ లైఫ్ ఆధారంగా రూపొందించారు.
"""/" /
స్టార్ హీరో కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ చిత్రానికి జి.
వి.ప్రకాష్ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించకుండా ఉండలేకపోయారు.
అభిమానుల హృదయాలను ఈ సినిమా హత్తుకుంది అని చెప్పవచ్చు.ఆర్మీ ఆఫీసర్ల జీవితాన్ని( Army Officers Life ) అర్థమయ్యేలా రూపొందించిన ఈ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి భాషల్లో కూడా మంచి ఆదరణ పొందింది.
విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ టాక్ ని తెచ్చుకుంది. """/" /
కాగా ఈ సినిమా విజయం సాధించడంతో పలువురు దర్శకులు, రాజకీయ నాయకులు, నటీనటులు ఈ చిత్రాన్ని సత్కరించడంతో ఇప్పుడు ఆర్మీ అధికారులు ఈ చిత్రానికి అవార్డును అందజేశారు.
ఈ సందర్భంలో, మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రను పోషించిన నటుడు శివకార్తికేయన్‌కు ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ తరపున అవార్డు అందించారు.
అమరన్ సక్సెస్ తర్వాత ఈ అవార్డును అందించారు.శివకార్తికేయన్ గతంలో ఎన్నడూ చేయనటువంటి డిఫరెంట్ పెర్ఫార్మెన్స్, అప్పియరెన్స్‌తో అద్భుతంగా నటించాడు.
ఈ సినిమాలో ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో నటి సాయి పల్లవి కూడా కీలక పాత్ర పోషించింది.
విడుదలైన 25 రోజుల తర్వాత భారతదేశంలోనే అమరన్ 210 కోట్లకు పైగా వసూలు చేసింది.
బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్!