కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసినా ఆర్మీ జవాన్ మధు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) తంగళ్లపళ్లి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన వీరవేణి సుదీక్ష మొదటి పుట్టినరోజు సందర్భంగా అమ్మాయి తండ్రి వీరవేణి మధు (ఆర్మీ జవాన్) సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి సారి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బార్డర్ లో సేవలను అందించడంతో పాటు సమాజ సేవలో భాగం కావాలని ఈరోజు రక్తదానం చేయడం జరిగింది అన్నారు.

రక్తదానం చేసి ప్రాణదాతలు అవండి అని యువతకి పిలుపునిచ్చారు.

ఒకే సారు అంటూనే … ‘కారు ‘ దిగేందుకు ఆ ఎమ్మెల్యేల స్కెచ్ ?