వీడియో వైరల్: కామెడీగా కుస్తీ చేయాలనుకున్న యువకుడు.. కానీ చివరికి..?!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అనేకమంది ఏమి చేయడానికి అయినా సిద్ధమైపోతున్నారు.

మరికొందరైతే ఇలా ఫేమస్ అయ్యే సన్నిధిలో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.ప్రస్తుతానికి ఇదే కోవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఓ కుస్తీ కార్యక్రమానికి వెళ్లాడు.

అయితే అక్కడ ఓ చెయ్యి కుస్తీలో( Arm Wrestling ) ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నాడు.

అతనితో చేయితో చేసే కుస్తీని పట్టడానికి అనేకమంది వచ్చి ఓడిపోయి వెళ్తుంటారు.అయితే ఆ చేయి కుస్తీ వీరుడిని ఓడించేందుకు సదరు వ్యక్తి స్నేహితులు అతడిని రెచ్చగొట్టడంతో అతను మొహమాటానికి పోయి చివరికి కుస్తీ పట్టడానికి సిద్ధమయ్యాడు.

"""/" / దాంతో అతడు స్టేజిపై ఉన్న కుస్తీ వీరుడు దగ్గరికి వెళ్లి మొదటగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అతడి ముందర కూర్చున్నాడు.

ఇంకేముంది దాంతో అసలైన చేయి కుస్తీ ఆట మొదలైంది.ఇందులో భాగంగానే కుస్తీ యోధుడు( Arm Wrestler ) సదరు వ్యక్తి చెయ్యి వంచడానికి ప్రయత్నించారు.

దాదాపు చెయ్యి నేలకు తగిలే స్థాయికి వెళ్తుండగా సదరు వ్యక్తి మాత్రం అతడి పూర్తి శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకొని చేతిని పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా దాంతో కుస్తీయోధుడు మాత్రం ఒక్కసారిగా అతని చేయిని నేలకు ఆనించే ప్రయత్నం చేశాడు.

"""/" / దాంతో అనుకోకుండా ఆ యువకుడి చేయి ఫట్ మంటూ అతడి చెయ్యి ఎముక విరిగింది.

దాంతో ఆ యువకుడు నొప్పితో ఇబ్బంది పడడం అక్కడ కనపడుతుంది.కేవలం పంతానికి పోయి చివరికి చెయ్యి విరగొట్టుకోవడంతో( Hand Broken ) ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ లో కొందరైతే 'హెచ్చులకు పోతే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయి' అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ ప్రోటీన్ మాస్క్ తో మీ కురులు అవుతాయి డబుల్..!