అర్జున్, విక్రమ్ నా ఫ్రెండ్స్.. కానీ అరెస్ట్ అయినప్పుడు ఒక్కరు సాయం చెయ్యలేదు: నటుడు ఆనంద్ భారతి

తాను, తన భార్య కలిసి అవుట్‌డోర్ వెళ్లినపుడు అక్కడ ఒక వాటర్‌ఫాల్స్ ఉంది.

తామిద్దరూ అక్కడ గడిపి తిరిగి వస్తుంటే వాళ్లకు మరొక గ్యాంగ్‌ ఎదురైందని వాళ్లంతా షూటింగ్ చేయడానికి వచ్చారని నటుడు ఆనంద్ భారతి అన్నారు.

వాళ్లు అలా ఎదురై తనను కూడా పిలిచారని, అలా వాళ్లతో వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు.

సడన్‌గా అక్కడ ఏమైందో తెలియదు గానీ కొందరు అక్కడ గొడవ పడి, కొట్టుకోవడం మొదలుపెట్టారని ఆయన అన్నారు.

అప్పటికీ తానొక పెద్ద సెలబ్రెటీ అన్న ఆయన, ఆ సమయంలో అక్కడి పోలీసులు ఏం జరిగిందో తెలుసుకోకుండా తనను అరెస్టు చేశారని ఆయన చెప్పారు.

ఆ తర్వాత పోలీసులు ఏవేవో కేసులు తన మీద పెట్టారని ఆనంద్‌ చెప్పుకొచ్చారు.

ఆ సంఘటన తర్వాత ప్రతి నెల అక్కడికి వెళ్లి అక్కడి కోర్టుకు హాజరయ్యానని, అది మద్రాస్‌లోని తిరునల్వేలి అని ఆయన అన్నారు.

ఆ తర్వాత ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసని, ఫైనల్‌గా ఆ కేసులో తాను గెలిచానని ఆయన చెప్పారు.

తన మీద నిజంగా ఎలాంటి తప్పులేదన్న ఆయన, అలాగే కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని, నిర్దోషిగా తాను బయటికి వచ్చానని ఆయన అన్నారు.

ఈ విషయంపై చాలా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు.నిజంగా అక్కడ జరిగిన సంఘటనలో తన ఇన్వాల్మెంట్‌ ఏం లేకుండా తాను చాలా సఫర్ అయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపోతే తాను అంత ఇబ్బందుల్లో ఉంటే, ఆ సమయంలో చిత్ర పరిశ్రమ నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ రాలేదని ఆయన అన్నారు.

ఇండస్ట్రీలో తనకు అర్జున్ విక్రమ్ మంచి స్నేహితులు కానీ నేను అరెస్ట్ అయిన సమయంలో వీరెవరూ తనకు సహాయం చేయలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.

నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానన్న ఆయన, కానీ తనకు ఆ సమయంలో మాత్రం ఎవరి నుంచీ, ఎలాంటి సపోర్ట్ రాలేదని ఆయన అన్నారు .

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్