ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం… ?
TeluguStop.com
తెలుగులో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన "గబ్బర్ సింగ్" చిత్రంలో కెవ్వు కేక అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన చిందులేసిన "బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ఈ అమ్మడు తన వన్నె తరగని అందంతో జీరో సైజ్ నడుము మెయింటేన్ చేస్తూ పలు రకాల ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాలతో ఫోజులు ఇస్తోంది.
అయితే తాజాగా మలైకా అరోరా ప్రముఖ ఫోటో షూట్ సంస్థ అయినటువంటి సర్వ స్టూడియోస్ నిర్వహించినటువంటి ఓ ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.
ఇందులో భాగంగా యోగా గురించి పలు ఆసక్తికర అంశాలను తెలియజేస్తూ యోగాసనం వేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.
దీంతో కొందరు నెటిజన్లు ప్రజల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేటువంటి యోగా గురించి సలహాలు, సూచనలు ఇవ్వడం మంచి విషయమని ఆమెను అభినందిస్తున్నారు.
ఈ ఫోటోని షేర్ చేసిన కొద్దికాలంలోనే దాదాపుగా లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి.
సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాలతో ఫోజులు ఇస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మలైకా అరోరా బాలీవుడ్ మరియు కోలీవుడ్ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటిస్తోంది.
అలాగే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ అయినటువంటి సోనీ టీవీ లో ప్రసారమయ్యే ఇండియాస్ బెస్ట్ డాన్సర్ అనే డ్యాన్స్ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.
జర్మనీకి పెరుగుతోన్న భారతీయ పర్యాటకులు.. 2024లో ఎన్ని లక్షల మంది వెళ్లారంటే?