మహేష్‌తో పోటీకి ఆలోచనలో పడ్డ బన్నీ.. ఈసారి లేనట్టేనట!
TeluguStop.com
టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.
కాగా ఇటీవల సంక్రాంతి పండగకు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రాగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు.
విశేషమేమిటంటే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్స్‌గా నిలిచాయి.
దీంతో ఈ ఇద్దరు ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.
బన్నీ ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన బన్నీ, షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నాడు.కాగా మహేష్ బాబు ఇటీవల తన నెక్ట్స్ మూవీ ‘సర్కారు వారి పాట’ని దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.
లాక్‌డౌన్ పూర్తికాగానే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్‌లు రెడీ అవుతున్నాయి.
అయితే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా కేవలం తెలుగు భాషలోనే వస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా వచ్చే వేసవిలో రిలీజ్ అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కానీ బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవచ్చని, పైగా సుకుమార్ సినిమా కావడంతో ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరి వచ్చే వేసవికి మహేష్ బన్నీల మధ్య పోటీ ఉంటుందా లేక సోలోగానే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారా అనేది చూడాలి.
రోడ్డుపై రీల్స్ చేస్తున్న యువత.. ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చిన కారు.. చివరకు?