అమెరికా : ఆరిజోనా రిపబ్లికన్ పార్టీ చైర్‌గా ట్రంప్ సన్నిహితురాలు గినా స్వోబోడా ..!!
TeluguStop.com
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) సన్నిహితురాలు, ఆయన మద్ధతు పొందిన గినా స్వోబోడా( V )ను ఆరిజోనా రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ చైర్‌గా ఎన్నుకున్నారు.
నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కీలకమైన ఆరిజోనా రాష్ట్రంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో గినాకు 67 శాతం ఓట్లు పోలైనట్లు ఫీనిక్స్ కేంద్రంగా పనిచేసే ఫాక్స్ 10 టెలివిజన్ నివేదించింది.
నిన్నటి వరకు జెఫె డెవిట్ ఈ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ చైర్‌గా వ్యవహరించారు.
యూఎస్ సేనేట్ అభ్యర్ధి కారీ లేక్( Kari Lake )కు ఉద్యోగం ఇస్తున్నట్లు ఆడియో రికార్డింగ్ లీక్ కావడంతో జెఫ్ డెవిట్ తన పదవికి రాజీనామా చేశారు.
"""/" /
గతేడాది మార్చిలో రికార్డ్ సమయంలో .యూఎస్ సెనేట్( United States Senate ) ప్రచారానికి లేక్ సిద్ధమైనప్పటికీ, 2022లో ఆరిజోనా గవర్నర్ రేసులో తన ఓటమిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాటం చేస్తున్నారు.
ఇంతలో వాషింగ్టన్‌కు చెందిన రిపబ్లికన్‌లు, మధ్యంతర ఎన్నికల్లో నిరాశజనకమైన ప్రదర్శనతో దెబ్బతిన్నారు.ఈ క్రమంలో సాధారణ ఎన్నికల్లో మరింత ఆచరణీయంగా వుండే రిపబ్లికన్ సెనేట్ నామినీలను కోరుకునే ప్రణాళికల గురించి వారు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
"""/" /
ఇకపోతే.2016, 2020లలో ట్రంప్ క్యాంపెయినింగ్ బృందానికి డెవిట్( DeVitt ).
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గానూ, ట్రంప్ అధ్యక్షుడిగా వున్న సమయంలో నాసాలో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గానూ వ్యవహరించారు.
స్వోబోడా విషయానికి వస్తే.ఆరిజోనా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫీస్‌లో మాజీ ఉద్యోగి.
2020లో ట్రంప్‌కు ఎలక్షన్ డే ఆపరేషన్స్ డైరెక్టర్‌గానూ పనిచేశారు.ఆరిజోనా సెనేట్‌కు ఎన్నికలపై సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
లాభాపేక్ష లేని సంస్థ ‘‘ ఓటర్ రిఫరెన్స్ ఫౌండేషన్ ’’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ స్వోబోడా పనిచేస్తున్నారు.
కొత్త చైర్ ఎన్నిక నేపథ్యంలో నార్త్ ఫీనిక్స్‌లోని డ్రీమ్ సిటీ చర్చ్‌లో జరిగిన జీవోపీ సమావేశానికి 1000 మందికి పైగా వ్యక్తులు హాజరయ్యారు.
ఎన్నికల తర్వాత స్వోబోడో.ఆరిజోనాలో పార్టీని మెరుగైన నిధుల సేకరణ, 2022 కంటే మెరుగైన ఎన్నికల ఫలితాల దిశగా నడిపిస్తారని రిపబ్లికన్లు భావిస్తున్నారు.
ప్రశాంత్ మూవీ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న ఎన్టీఆర్.. తొలిసారి అలా చేస్తున్నారా?