ట్రంప్‌ను చంపేస్తానంటూ బెదిరింపులు.. మరోసారి ఉలిక్కిపడ్డ అమెరికా
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) భద్రత అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో పెన్సిల్వేనియాలోని( Pennsylvania ) బట్లర్ ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ ఏర్పాటు చేసిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు.
దీంతో ఆయనను లక్ష్యంగా చేసుకున్న అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు.కాల్పుల శబ్ధం వినిపించిన వెంటనే ట్రంప్ పోడియం కిందకి చేరి తనని తాను రక్షించుకున్నారు.
వెంటనే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయనకు రక్షణ కవచంలా నిలిచారు. """/" /
అప్పటికే బుల్లెట్ ట్రంప్ కుడి చెవి మీదుగా వెళ్లి గాయమైంది.
అనంతరం భారీ భద్రత మధ్య ఆయనను ఆసుపత్రికి తరలించారు.మరోవైపు సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలోని స్నైపర్ షూటర్ వేగంగా స్పందించి.
దుండగుడిని మట్టుబెట్టాడు.ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.అయితే యూఎస్ సీక్రెట్ సర్వీస్ తీరుపై రిపబ్లికన్ పార్టీ( Republican Party ) నేతలు మండిపడుతున్నారు.
ట్రంప్ భద్రత విషయంలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శిస్తున్నారు.దీంతో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ తన పదవికి రాజీనామా చేశారు.
"""/" /
మొన్నామధ్య తను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వెనుక సైబర్ దాడి జరిగి ఉంటుందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలతో ట్రంప్‌కు భద్రతను పెంచారు అధికారులు.తాజాగా డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడం కలకలం రేపగా అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని అరిజోనాలోని కోచిస్ కౌంటీ ప్రాంతానికి చెందిన రోనాల్డ్ సివ్రుద్‌గా( Ronald Syvrud ) గుర్తించారు.
ఇతనిపై అనేక ప్రాంతాల్లో హిట్ అండ్ రన్, లైంగిక వేధింపుల కేసులున్నాయి.రోనాల్డ్ గత కొద్దిరోజులుగా ట్రంప్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల బరిలో భారత సంతతి మహిళా డాక్టర్