ఆ హీరోయిన్ మీద ఫైర్ అయిన అరియానా గ్లోరీ.. వాళ్ల మీద ఈగ కూడా వాలనివ్వరా అంటూ?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అరియానా( Ariyana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బిగ్ బాస్ షో ( Bigg Boss ) ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

ఇక రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో పలు షోలకు యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా నీతోనే డాన్స్ 2.0 కి( Neethone Dance 2.

0 ) సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. """/" / ఇందులో అరియనా-అవినాష్ ఎంట్రీ ఇచ్చారు.

అలాగే మానస్- సుబ్బు జోడీలో సుబ్బుకి హెల్త్ బాగాలేక పోవడంతో మానస్ ఒక్కడే షోకి వచ్చాడు.

అయితే మరి జోడీ ఎవరు నీకు అని శ్రీముఖి అనేలోపు వెనక నుంచి భానుశ్రీ( Bhanusri ) ఎంట్రీ ఇచ్చింది.

అబ్బాయి అబ్బాయి డాన్స్ చేయకూడదు.అబ్బాయి అమ్మాయి డాన్స్ చేయాలి అని శ్రీముఖి అనేసరికి అందరూ నవ్వేశారు.

అలాగే అమరదీప్ - తేజస్విని గౌడ ఇద్దరూ ఈ షోలో కనిపించారు.ఐతే ఈ వారం ఎపిసోడ్ లో రెండు జంటల మధ్య గట్టిగా యుద్ధం జరగబోతోందన్న విషయం ప్రోమో ద్వారా తెలుస్తోంది.

అదే అవినాష్ - అరియానా, విశ్వా నయని పావని జంటల మధ్య మార్కుల యుద్ధం జరిగింది.

"""/" / ఒకరికి పోటీ మరొకరు తక్కువ మార్క్స్ ఇచ్చుకుని అరుచుకున్నారు.అలాగే నితిన్- అక్షితే హారర్ పెర్ఫార్మెన్స్ కి ఇచ్చిన మార్క్స్ విషయంలో అమరదీప్ - తేజు అండ్ బ్రిట్టో - సంధ్య జోడీలు మధ్య బాగా యుద్ధం జరిగింది.

ఇక విశ్వా - నయని పావని( Vishwa - Nayani Pavani ) డాన్స్ కి ఆరియానా చాలా తక్కువ మార్క్స్ ఇచ్చేసరికి సదా( Sadaa ) మధ్యలో ఆరియానా మీద అరిచేసింది.

ఆరియానా కూడా జడ్జెస్ అలా అరవకూడదంటూ రివర్స్ కౌంటర్లు వేసింది.ఐతే జడ్జి సదాకి ఈ డాన్స్ షోలో బ్రిట్టో, విశ్వా, నేహా చౌదరి, యావర్ అంటే విపరీతమైన ఇష్టం.

వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వరు.ఇక అరియనా గట్టిగా అన్న మాటలకు సదా అహం దెబ్బతిని షోలోంచి లేచి వెళ్ళిపోయింది.

అయితే ఇదంతా జస్ట్ ప్రోమో కోసమా లేకపోతే నిజంగానా జరిగిందా అన్నది తెలియాలి అంటే పూర్తి వీడియో వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగిన 76వ రిపబ్లిక్ డే వేడుకలు .. భారీగా హాజరైన ఎన్ఆర్ఐలు