పెళ్లి విషయంలో గొడవ.. ప్రియురాలిని హత్య చేసిన ఆర్మీ ఆఫీసర్..!

ఈమధ్య కాలంలో ప్రేమ వ్యవహారాలన్నీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఘోరంగా విఫలం అవుతున్నాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

కొంతమంది వ్యామోహం, ఇతర అవసరాల కోసం ప్రేమ ఉన్నట్లు నటించి పెళ్లి వరకు వచ్చేసరికి తమ అసలు నిజస్వరూపాన్ని బయట పెడుతున్నారు.

ఇలాంటి కోవలోనే ఓ యువతిని ప్రేమించి పెళ్లి ప్రస్తావన రావడంతో ఆర్మీ అధికారి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన డెహ్రాడూన్( Dehradun ) లో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం. """/" / వివరాల్లోకెళితే.

లెఫ్ట్నెంట్ కల్నల్ రామెండు ఉపాధ్యాయ్( Lt Col Ramendu Upadhyay ) మూడేళ్ల క్రితం క్లెమెంట్ టౌన్ కంటోన్మెంట్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే ఈ ఆర్మీ అధికారికి సిలిగురిలోని ఓ బార్ లో డాన్సర్ గా పని చేస్తున్న నేపాలి మహిళా శ్రేయ శర్మ పరిచయం అయింది.

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు సహజీవనం చేయడం ప్రారంభించారు. """/" / కొద్ది రోజుల క్రితం ఆర్మీ ఆఫీసర్ డెహ్రాడూన్ కు బదిలీ అయ్యాడు.

దీంతో ఆ ఆర్మీ అధికారి తనతో పాటు ఆమెను కూడా డెహ్రాడూన్ కు తీసుకెళ్లాడు.

అయితే అప్పటికే ఆ ఆర్మీ ఆఫీసర్ కు వివాహం అవడంతో డెహ్రాడూన్ లో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని అందులో శ్రేయ శర్మను( Shreya Sharma ) ఉంచాడు.

ఇలా మూడేళ్లుగా ఆమె వద్దకు వస్తూపోతూ ఉండేవాడు.ఈ క్రమంలో శ్రేయ శర్మ తనను వివాహం చేసుకోవాలని ఆర్మీ ఆఫీసర్ పై ఒత్తిడి పెంచింది.

గత శనివారం రాత్రి రాజ్పూర్ రోడ్డు లో ఉండే ఓ క్లబ్లో ఇద్దరు కలిసి మద్యం సేవించి, కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు.

అర్థరాత్రి 1:30 గంటల సమయంలో థానో పట్టణం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో సుత్తితో పలుమార్లు తలపై దాడి చేయడంతో ఆమె క్షణాల్లో ప్రాణాలు విడిచింది.

అనంతరం ఆమె మృతదేహాన్ని పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడేసి అక్కడి నుండి ఆర్మీ ఆఫీసర్ వెళ్లిపోయాడు.

పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.లెఫ్టినెంట్ కల్నల్ ఉపాధ్యాయ్ బండారం బయటపడింది.

జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్.. 2025 బాక్సాఫీస్ పోరులో గెలుపెవరిదో?