కాంగ్రెస్ లొల్లి.. మళ్ళీ షురూ !
TeluguStop.com
టి కాంగ్రెస్ ను మొదటి నుంచి ఆదిపత్య పోరు ఏ స్థాయిలో వెంటాడిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
రేవంత్ రెడ్డి( Revanth Reddy ) టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టినది మొదలుకొని సీనియర్స్ మరియు రేవంత్ రెడ్డి గా వార్ కొనసాగుతూ వచ్చింది.
ఈ వార్ కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ( Congress Party ) కనుమరుగయ్యే పరిస్థితులు కూడా ఒకానొక టైమ్ లో తారసపడ్డాయి.
అయితే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో టి కాంగ్రెస్ లోని పరిస్థితులు మారిపోయాయి.
అంతవరకు ఆధిపత్య విభేదాలతో కొట్టుమిట్టాడిన పార్టీ నేతలు.వాటన్నిటిని పక్కన పెట్టి ఒకే తాటిపైకి రావడం మొదలు పెట్టారు.
కలిసికట్టుగా పార్టీని విజయ తీరాలకు చేర్చుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే రేవంత్ రెడ్డిపై మొదటి నుంచి అసంతృప్తి గానే ఉన్న సీనియర్స్ ఎంతమేర రేవంత్ రెడ్డి నాయకత్వానికి సహకరిస్తారనేది ఆసక్తి కలిగించే అంశం.
"""/" /
ఇప్పటివరకు విభేదాలు లేవని చెబుతున్నా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు హస్తం నేతలు.
ఇక మరోసారి టి కాంగ్రెస్ నేతల మద్య విభేదాలు చర్చకు దారి తీస్తున్నాయి.
ఎన్నికలకు మరో మూడు నెలలే సమయం ఉండడంతో సీట్ల పంపకలపై దృష్టి పెట్టిన హస్తం పార్టీ నేతలు మొదటి లిస్ట్ కోసం ముమ్మర కసరత్తులు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ రెండు సీట్ల విషయంలో రేవంత్ రెడ్డి మరియు మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) మద్య రగడ మొదలైందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
హుజూర్ నగర్ నుంచి ఆయన కోదాడ నుంచి ఆయన బార్య పద్మావతి రెడ్డిని( Padmavati Reddy ) బరిలో దించాలని ఉత్తమ్ ప్రణాళిక వేసుకున్నారు.
"""/" /
ఇప్పటికే ప్రకటించారు కూడా అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి టికెట్లు కేటాయించడంపై రేవంత్ రెడ్డి అడ్డు పడుతున్నారట.
దీంతో రేవంత్ వైఖరి పై ఉత్తమ్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశిస్తున్నాట్లుగా రెండు సీట్లు దక్కకపోతే ఆయన వైఖరి ఎలా ఉండబోతుందనేది కూడా ఆసక్తికరమే.
అసలే గత కొన్నాళ్లుగా ఉత్తమ్ పార్టీ మారతాడనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
దీంతో ఆయన పార్టీ మారిన ఆశ్చర్యం లేదనేది కొందరు చెబుతున్నా మాట.
మొత్తానికి ఎన్నికల ముందు మళ్ళీ సీనియర్స్ వర్సస్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తెరపైకి రావడం ఆ పార్టీని కొంత కలవర పెట్టె అంశమే.
రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీయార్ వీళ్లలో టాప్ హీరో అతనేనా..?