యంగ్ డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారా..?

ఒక సినిమా సక్సెస్ కావాలంటే అందులో దర్శకుడు పాత్ర చాలా కీలకమనే చెప్పాలి.

ఎందుకంటే సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా సరే తనే దగ్గరుండి చూసుకుంటాడు.

తనకు నచ్చితే సినిమాలో ఉంచుతాడు.లేదంటే సినిమా నుంచి తీసేస్తాడు.

కాబట్టి సినిమా సక్సెస్ అవ్వాలన్న ఫెయిల్యూర్ సాధించాలి అన్న అది దర్శకుడి మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పాలి.

ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

"""/" / మొత్తానికైతే గా యంగ్ డైరెక్టర్స్ గా పేరు సంపాదించుకున్న వివేక్ ఆత్రేయ,( Vivek Athreya ) తరుణ్ భాస్కర్,( Tharun Bhaskar ) వెంకటేష్ మహా( Venkatesh Maha ) లాంటి డైరెక్టర్లు అందరూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగానే వివేక్ ఆత్రేయ నానితో చేసిన 'సరిపోదా శనివారం'( Saripodhaa Sanivaaram ) సినిమాతో డిఫరెంట్ యాక్షన్ ని ప్లాన్ చేసుకొని బరిలోకి దిగాడు.

ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నాడనే విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు.

"""/" / కానీ మొత్తానికైతే ఆయన మరో భారీ సినిమాను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తూ ముందుకు సాగడమే కాకుండా ఆయనకు ఒక మంచి క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయనే చెప్పాలి.

వెంకటేష్ మహా లాంటి దర్శకుడు ' కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో మంచి విజయాన్ని సాధించి 'నేషనల్ అవార్డు' ను కూడా అందుకున్నాడు.

కానీ ఆ తర్వాత చేసిన సినిమాలేవి అతనికి అంత మంచి గుర్తింపును తీసుకురాకపోవడంతో ఇప్పుడు నటుడిగా కూడా రాణించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరి ఏది ఏమైన కూడా కేరాఫ్ కంచరపాలెం లాంటి ఒక వినూత్నమైన ఐడియాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

తాగి పడేసిన సిగరెట్ పీకలతో అద్భుతం చేస్తున్న వ్యక్తి (వీడియో)