శని దేవుడికి పూజ చేస్తున్నారా.. అయితే ఈ దోషాలు ఉన్నాయేమో చూసుకోండి..?

శని( Lord Shani ) ప్రభావం మనిషి మీద పడినప్పుడు దాన్ని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది.

అందుకే శని ప్రభావం మన మీద పడకుండా పూజలు చేస్తూ ఉంటాము.కానీ మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు శని ప్రభావాన్ని మరింత పెంచుతాయి.

ఆ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.శని యొక్క కదలిక ప్రజల జీవితంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రతి ఒక్కరూ శని యొక్క దృష్టి తమ మీద పడకుండా చూసుకోవాలి.శని దేవుడిని పూజించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

శని దేవుడిని పూజించేటప్పుడు ముందు దీపం వెలిగించడం మానుకోవాలి. """/" / దీనికి బదులుగా రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.

మీరు ఇంట్లో ఉన్నట్లయితే పశ్చిమ దిశలో శని దేవుడిని ధ్యానిస్తూ మంత్రాలను జపించాలి.

ప్రతి శనివారం క్రమం తప్పకుండా శని దేవుడిని ఆరాధించాలి.గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా శని దేవుని కళ్ళలోకి నేరుగా చూడకూడదు.

కళ్ళు మూసుకొని ప్రార్థించాలి.లేదంటే శని దేవుని పాదాల వైపు చూస్తూ ప్రార్థించాలి.

అలాగే శని దేవుడిని పూజించేటప్పుడు ఎరుపు బట్టలు వీలైనంత వరకు వేసుకోకూడదు.శని దేవునికి ఇష్టమైన రంగులు నలుపు, నీలం( Black, Blue ).

అలాగే శని దేవుడు కోసం మీరు నూనెని ఇవ్వాలనుకున్నప్పుడు రాగి పాత్రలు ఉపయోగించకూడదు.

"""/" / ఎప్పుడూ ఇనుప పాత్రలు మాత్రమే ఉపయోగించాలి.శని దేవుడిని ఆరాధించేటప్పుడు దిశ పై కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి.

సాధారణంగా మనం తూర్పు వైపున దేవుడిని పెట్టుకుని అటువైపు తిరిగి పూజలు చేస్తూ ఉంటాము.

కానీ శని దేవుని పూజించేటప్పుడు మాత్రం పశ్చిమానికి ఎదురుగా నిలబడి పూజించాలి.ఎందుకంటే పశ్చిమ దిక్కుకి అధినేత శని దేవుడు.

అలాగే శని దేవుడి పటాన్ని మన దేవుడు గదిలో గాని మన ఇంట్లో కానీ ఉంచకూడదు.

అలా చేయడం వల్ల ఇంటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.