బూడిద గుమ్మడికాయ మీరూ ఇంటి ముందు కడుతున్నారా.. అయితే ఇది మీకోసమే..
TeluguStop.com
మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వంటింట్లో దొరికే కూరగాయలను చెడిపోకుండా ఫ్రిజ్లలో, పరిశుభ్రమైన స్థలాలలో ఉంచుకుంటూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే మన వంటింట్లో దొరికే కూరగాయాలు ఎన్ని రోజులు ఉంచిన చెడిపోని ఒకే ఒక కూరగాయ గుమ్మడికాయ అని చెప్పవచ్చు.
ఈ గుమ్మడికాయలో రెండు రకాల గుమ్మడికాయలు ఉంటాయి.ఒకటి మామూలు గుమ్మడికాయ, రెండవది బూడిద గుమ్మడికాయ అయితే మామూలు గుమ్మడికాయతో పోల్చితే బూడిది గుమ్మడికాయ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే అవకాశం ఉంది.
నివారణ కోసం ఇంటి గుమ్మం పై కడితే కొద్ది రోజులకే పాడైపోతూ ఉంటుంది.
అయితే అలా కొద్ది రోజులకే బుడిది గుమ్మడికాయ పాడవడానికి అనేక కారణాలు ఉన్నాయని చాలామంది చెబుతున్నారు.
అలా తొందరగా బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోతే ఇంటి నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నట్లు చెబుతూ ఉంటారు.
మన పెద్దలు నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు.
అందుకే ఈ బూడిద గుమ్మడికాయను వ్యాపార స్థలాలలో, ఇంటిదగ్గర నివారణ కోసం కడుతూ ఉంటారు.
అంతేకాకుండా నరదృష్టి నివారణ కోసం ఇంటి ముందు గుమ్మడికాయ కట్టకపోతే ఒక బూడిద గుమ్మడికాయ, గోమాత సహిత, నవ యంత్ర, యుక్త ఐశ్వర్య, ఖాళీ ఫోటో ఇంటి లోపల గుమ్మంపై అమర్చుకోవడం మంచిది.
ఇలా చేసిన తర్వాత ప్రతిరోజు రెండు అగరవత్తులు వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించడం మంచిది.
ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయ ఐశ్వర్య, కాళీ ఫోటో యంత్రము ఉండడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.
"""/"/
అయితే ఎప్పుడైనా మీరు బూడిద గుమ్మడికాయ కట్టిన కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయి అంటే దాని అర్థం మీ ఇంటికి ఎక్కువగా నరగోష, నరదృష్టి, నర పీడ ఉంది అని అర్థం చేసుకోవచ్చు.
మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయల తీసుకొని చెడిపోతుందని చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు.
అలా పాడైపోయిన గుమ్మడికాయను పారేసి మరొక గుమ్మడికాయకు పూజ చేసి మళ్ళీ గుమ్మానికి కట్టడం మంచిది.
అలాగే అద్దె ఇంట్లో నివసిస్తున్నావారు కూడ ఇంటి ద్వారం ముందు గుమ్మడికాయను కట్టుకోవడం మంచిది.
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?