ఓటు వేస్తున్నారా ? వీటి గురించి తెలుసుకున్నారా ?

రేపు ఉదయం నుంచి ఏపీలో ఎన్నికల పోలింగ్( Ap Election Polling ) మొదలు కాబోతోంది.

దీంతో ఓటర్ల దృష్టిలో పడేందుకు అన్ని పార్టీ లు రకరకాల ప్రయత్నాలు చేస్తూ,  రకరకాల మార్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

  ఇక ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం( Election Commission ) కూడా ఏర్పాట్లు చేస్తోంది.

  ఇప్పటికే ఓటర్లకు ఓటింగ్ స్లిప్పులు అందాయి .ఇతర ప్రాంతా ల నుంచి ఓటు హక్కు ఉన్నవారు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు తరలి వచ్చారు  సులభంగా ఓటు వేయడానికి ఎన్నికల సంఘం అనేక సూచనలు చేసింది.

  ఇప్పటికే ఓటరు స్లిప్( Voter Slip ) అందకపోయినా,  ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

  ఓటరు తమ పేరును ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో చెక్ చేసుకుని , అక్కడ నుంచి ఓటర్ స్లిప్ ను డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.

ఒకవేళ ఎపిక్ కోడ్ లేకపోతే ,మీ పేరు,  ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినా వివరాలు తెలుస్తాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

  ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్లలేకపోయినా , ఫోన్ లోనే సెర్చ్ చేసుకుని ఈ వివరాలను పొందవచ్చు.

"""/" / పోలింగ్ బూత్( Polling Booth )  దగ్గరకు వెళ్తే అక్కడ స్లిప్ ఇస్తారు.

  మీ పోలింగ్ బూత్ నెంబర్ దానిపై ఉంటుంది .మీ దగ్గర ఓటర్ కార్డు గుర్తింపు ఉంటే సరే , లేదంటే 13 రకాల గుర్తింపు కార్డులో ఒకదానినైనా పోలింగ్ బూత్ లో చూపించవచ్చు.

అదే సమయంలో గుర్తింపు కార్డు( Identity Card ) తప్పనిసరి.13 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్ బూత్ లో చూపించవచ్చు .

ఆధార్ కార్డు , పాన్ కార్డు , డ్రైవింగ్ లైసెన్స్ , భారతీయ పాస్ పోర్ట్ ఫోటో ఉన్న బ్యాంక్ లేదా, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్,  సర్వీస్ ఐడి కార్డు ,ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు, MNREGA జాబ్ కార్డు హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, ఫోటో గల పెన్షన్ పత్రాలు కేంద్రం జారీ చేసిన డిసేబులిటీ కార్డు, ఎంపీ , ఎమ్మెల్యేల ఐడీ కార్డులలో ఏదో ఒకటి చెల్లుతుంది.

"""/" / H3 Class=subheader-styleఓటింగ్ విధానం ఈ విధంగా./h3p ఎడమ చూపుడు వేలిపై సిర గుర్తు వేస్తారు.

మీ వివరాలను ఫామ్ 17 ఏ లో నమోదు చేస్తారు.ఆ సమయంలో ఓటరు జాబితాలో మీ బొటని ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు ఆ తర్వాత మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్మెంట్ కు వెళ్లడానికి అనుమతి ఇస్తారు.

ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేస్తే ఈవీఎం మిషన్ దాని పక్కనే వివి ప్యాట్ ఉంటుంది.

మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కనే ఉన్న బ్లూ కలర్ బటన్ నొక్కితే మీ ఓటు నమోదు అయినట్లే.

బటన్ నొక్కిన తరువాత 5 సెకండ్ల పాటు బీఫ్ సౌండ్ వినిపిస్తుంది.ఆ వెంటనే ప్యాట్ మిషన్ పై పచ్చటి లైట్ వెలిగి లోపల స్లిప్ కనిపిస్తుంది.

మీరు ఎవరికి ఓటు వేశారో వారి పేరు సీరియల్ నెంబర్ పార్టీ గుర్తు దానిపై కనిపిస్తాయి.

కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్ధుల హత్య .. రంగంలోకి విదేశాంగ శాఖ