వాట్సాప్ వినియోగిస్తున్నారా… మీకోసమే ఈ బిగ్ అలర్ట్

నల్లగొండ జిల్లా: ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్, ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్ ఇప్పుడు మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది.

స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో,అధునాత టెక్నాలజీతో కూడిన మొబైల్స్‌ని మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటారు.

ఇందుకు అగునుణంగానే.మేటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు పాత ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌లను వదిలించుకుంటుంది.

పాత వెర్షన్ స్మార్ట్‌ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ చేయకుండా నిలిపివేస్తుంది.తాజాగా ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించింది వాట్సాప్.

తాజా సమాచారం ప్రకారం.ఆండ్రాయిడ్ 4,దానికంటే పాత వెర్షన్ IOS 11,అంతకంటే పాత వెర్షన్.

Kai OS 2.4,అంతకంటే పాత వెర్షన్‌ ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.

మొత్తం 35 స్మార్ట్ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ సపోర్ట్ చేయబోదని కంపెనీ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.

ఆండ్రాయిడ్ 5,ఆపై వెర్షన్‌లలో IOS 11,ఆపై వెర్షన్‌లో వాట్సాప్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

వాట్సాప్ తాజా ప్రకటన ప్రకారం.ఏయే మోడల్ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదో నిపుణులు అంచనా వేసి చెప్పారు.

వాటిలో యాపిల్,సామ్‌సంగ్, హువాయి,మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

వీడియో: చిరుతపులితో పోరాడిన పిట్‌బుల్.. తర్వాతేమైందో చూడండి..