జాగ్రత్త... చక్కెరను అతిగా వాడుతున్నారా? ఈ సమస్య రావచ్చు!

చాలామందికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం.ఉదయం తీసుకునే టీ నుండి చక్కెరను బాగా తీసుకుంటాం .

ఏదైనా శుభకార్యాలలో ముందుగా తీపి పదార్ధాలనే ఎక్కువగా వాడుతుంటాం.బెల్లం కంటే చక్కెర ఎక్కువ వాడుకలో ఉంటుంది.

కానీ చక్కెర అతిగా తినడం వల్ల ప్రాణానికి ముప్పు ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

చక్కెరను అతిగా తినడం వల్ల షుగర్ వంటి సమస్యలే కాకుండా మరో ప్రాణాంతకమైన సమస్య ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

చక్కెరలు ఎక్కువగా తినడం వల్ల అది శరీరంలోకి చేరి చక్కెర పదార్థం ఒకటే చోట పులిసిపోతుందని తెలుపగా పులిసిన చక్కెర భాగం శరీరంలో ఉన్న కేన్సర్ కణాలు ఆ చక్కెరను తీసుకొని మరింత శక్తిని పెంచుకుంటుంది.

దీంతో ఈ శక్తి వల్ల కేన్సర్ కణాలు శరీరంలో ఉన్న అన్ని అవయవాలపై ప్రభావం చూపుతూ ప్రాణాల మీదకు దారితీస్తాయని బెల్జియం శాస్త్రవేత్తలు దాదాపు 9 సంవత్సరాల పాటు పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించారు.

"""/" / చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల ఇంత పెద్ద సమస్య ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు కూడా ఊహించలేకపోయారు.

కాబట్టి చక్కెరను ఎంత తక్కువగా వాడితే అంత శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

బయట దొరికే స్వీట్స్ లో ఎక్కువ చక్కెరను వాడుతుంటారు.చాలా వరకు తీపిని ఇష్టపడే వాళ్ళు చక్కెరకు బదులు బెల్లం తీసుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

బెల్లం తీసుకోవడం వల్ల ఐరన్ శాతం పెరగడమే కాకుండా శరీరానికి మంచి మేలు చేస్తుందని తెలిపారు.

కాబట్టి చక్కెరను వీలైనంత వరకు తక్కువ వాడుకలో ఉండేటట్లు చూసుకోవాలి.చక్కెర వల్ల షుగర్ శాతం పెరగడమే కాకుండా, కేన్సర్ వ్యాధికి దారితీస్తాయని.

ఈ వ్యాధి నుండి బయటపడడానికి ఇతర మార్గాలు లేవని తెలిపారు.

అవినీతి గురించి జగన్ మాట్లాడడమా..? లోకేష్ సెటైర్లు