పంచదారకు బదులుగా వీటిని వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే..

ప్రస్తుత సమాజంలో ఆరోగ్యం పట్ల ప్రజలలో కాస్త శ్రద్ధ పెరిగింది.ఈ కారణంగా వారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు.

ముఖ్యంగా చక్కెర పదార్థాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.ఈ క్రమంలో చక్కెరకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ వైపుగా తమ దృష్టిని మళ్లిస్తున్నారు.

అంతేకాకుండా మధుమేహంతో బాధపడేవారు సైతం సాధారణంగా చక్కెరకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

సాధారణంగా పంచదారలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.పైగా పోషకాలు అసలు ఉండవు.

దీనివల్ల ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతోంది.అందుకని ఆధునిక జీవనశైలిలో పంచదారను తగ్గించాలని వైద్యుల కూడా చెబుతున్నారు.

దీని వల్ల కొందరు ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ ఎంపిక చేసుకుంటున్నారు.కానీ ఇలాంటి ఉత్పత్తులతోనూ రిస్క్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

"""/" / కృత్రిమ చక్కెర పదార్థాలలో ఒకటైన ఎరిత్రిటాల్'తో హార్ట్ ఎటాక్ రిస్క్ ఉంటుందని తాజా అధ్యయనాలలో తెలిసింది.

క్లెవలాండ్ క్లినిక్ నిర్వహించిన ఈ అధ్యాయనం ప్రకారం ఎరిత్రిటాల్ ను దీర్ఘకాలం పాటు ఉపయోగిస్తే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్ పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

అమెరికా యూరప్ లో నాలుగు వేల మంది పై అధ్యయనం నిర్వహించారు. """/" / ఎరిత్రిటాల్ ప్లేట్ లెట్లను యాక్టివేట్ చేసి క్లాట్ ఏర్పడేందుకు కారణమవుతున్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు.

ఇటీవల కాలంలో ఎరిత్రిటాల్ మాదిరి ఆర్టిఫిషియల్ తీపి పదార్థాలకు ఆదరణ బాగా పెరిగింది.

దీర్ఘకాలంలో వీటి ప్రభావాలపై మరింత లోతైన పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పంచదారతో పోలిస్తే ఎరిత్రిటాల్ లో 70% చక్కర ఎక్కువగా ఉంటుంది.

మొక్కజొన్నను ఫెర్మెంట్ చేసి దీన్ని కూడా తయారు చేస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే కృతిమ తీపి పదార్థాలను తీసుకునేవారు అసహజంగా బరువు పెరిగి, జీవక్రియల సంబంధ వ్యాధుల రిస్క్ ఏర్పడుతుందని కార్డియాలజిస్ట్ మోహిత్ గుప్తా వెల్లడించారు.

వైరల్ అవుతోన్న పదేళ్ల నాటి వీడియో.. చిక్కుల్లో ఎలాన్ మస్క్, ట్రంప్ మెడకు చుట్టుకుంటుందా?