నెట్‌ఫ్లిక్స్ రూ.649 ప్లాన్ వాడుతున్నారా.. అద్భుమైన బెనిఫిట్స్

చాలా మంది యూజర్లను కోల్పోయిన నెట్‌ఫ్లిక్స్ తిరిగి వారిని ఆకట్టుకునేందుకు అదనపు ప్రయోజనాలు అందిస్తోంది.

ముఖ్యంగా రూ.649 ప్రీమియం ప్లాన్ వాడే యూజర్లకు చాలా బెనిఫిట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్పేషియల్ ఆడియో సపోర్ట్‌, 3D ఆడియో ఎఫెక్ట్‌, ఆరు డివైజ్‌ల్లో డౌన్‌లోడ్ కంటెంట్‌, 4K లేదా UHD రిజల్యూషన్‌ వంటి ప్రయోజనాలు కల్పిస్తోంది.

ప్రీమియం వినియోగదారులతో ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆశతో, నెట్‌ఫ్లిక్స్ తన అత్యంత ఖరీదైన ప్లాన్‌లో అప్‌గ్రేడ్ చేసిన కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

"""/"/ ప్రస్తుతం ఉన్న ఆడియో కంటే మెరుగ్గా ఆడియో అనుభవాన్ని ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు నెట్ ఫ్లిక్స్ అందిస్తోంది.

దాని కోసం స్పేషియల్ ఆడియో సపోర్ట్‌ తీసుకొచ్చింది.ఇక సినిమా హాల్ లో మీకు ఇష్టమైన సినిమా చూస్తున్నప్పుడు 360 డిగ్రీలలో ఆడియో వినొచ్చు.

ప్రస్తుతం అదే ఫీచర్‌ను 3డీ ఆడియో ఎఫెక్ట్ పేరుతో సబ్ స్క్రైబర్ల కోసం నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చింది.

దీని కోసం సౌండ్ బార్, హోమ్ థియేటర్ వంటివి కూడా అవసరం లేదు.

అంతేకాకుండా ఈ ప్లాన్ వాడే వారు ఆరు డివైజ్‌లలో నెట్ ఫ్లిక్స్ ఉపయోగించుకోవచ్చు.

"""/"/ ఇప్పటి వరకు ఈ పరిమితి 4 డివైజ్‌లకు మాత్రమే ఉండేది.ఆ పరిమితిని నెట్ ఫ్లిక్స్ పెంచింది.

వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీని 4కే లేదా యూహెచ్‌డీ నాణ్యతతో వీక్షించవచ్చు.ఎక్కడికైనా ప్రయాణం చేసే సమయంలో డౌన్ లోడ్ చేసుకున్న వీడియోలను అత్యంత నాణ్యతతో కూడిన చూడొచ్చు.

ఈ ఫీచర్లను ప్రీమియం సభ్యులు ఇంట్లో టీవీలో, కంప్యూటర్‌లో, ఫోన్ లేదా టాబ్లెట్‌లో చూసినా ఇదే అనుభవాన్ని పొందుతారని నెట్ ఫ్లిక్స్ పేర్కొంది.

అప్పట్లోనే 500 కోసం అలాంటి పని చేసిన అనసూయ.. ఇన్నాళ్లకు బయట పెట్టిందిగా?