గూగుల్ పే, ఫోన్ పే వినియోగిస్తున్నారా.. సైబర్ కేటుగాళ్ల కొత్త తరహా మోసం.. జాగ్రత్త..!

టెక్నాలజీ వల్ల సాధారణ ప్రజల కంటే సైబర్ నేరగాళ్లకే ఎక్కువ లబ్ది పొందుతున్నారు.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యవహారం ఆన్లైన్ ద్వారానే జరుగుతున్న క్రమంలో గూగుల్ పే(Google Pay), ఫోన్ పే(Phone Pay), పేటీఎం(Paytm) లాంటి వాటితో పాటు ఫేస్బుక్(Facebook), ఇంస్టాగ్రామ్(Instagram), ట్విట్టర్ల(Twitter) వినియోగం భారీగా పెరిగింది.

ఈ యాప్స్ ద్వారా అమాయక ప్రజలను టార్గెట్ చేసి కోట్లల్లో డబ్బులు దోచుకుంటున్నారు.

ఏది కొనాలన్నా ఫోన్ పే లేక గూగుల్ పేపై సాధారణ ప్రజలు ఆధారపడడంతో వీటినే టార్గెట్ చేసుకున్నారు సైబర్ నెరగాళ్లు.

ఒక్క ముంబై నగరంలోనే కేవలం 15 రోజులలో 81 మంది ఖాతాల నుండి ఏకంగా కోటి రూపాయలను దోచేశారు.

సైబర్ కేటుగాళ్లు ముందుగా కొందరు ఖాతాదారులను టార్గెట్ చేసి గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్లకు కొంత అమౌంట్ పంపిస్తారు.

ఆ తరువాత కాల్ చేసి పొరపాటున మీ ఖాతాకు డబ్బులు పంపించాం.దయచేసి తమ డబ్బులు తమకు తిరిగి పంపాలని రిక్వెస్ట్ చేస్తారు.

ఒకవేళ జాలిపడి డబ్బులు వాళ్ళు చెప్పిన నెంబర్ కు పంపిస్తే క్షణాల్లో బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది.

"""/" / ఎలా అనుకుంటున్నారా సింపుల్ తిరిగి వారి ఖాతాకు డబ్బులు పంపిస్తే బ్యాంక్ ఖాతా మాల్వేర్ అటాక్ కు గురవుతుంది.

దీనితో మన బ్యాంక్ వివరాలు అన్ని వారికి తెలిసి పోతాయి.దీనిని మాల్వేర్ ప్లస్ హ్యూమన్ ఇంజనీరింగ్ స్కాం గా(Malware Plus Human Engineering As A Scam) చెప్పుకోవచ్చు.

ఇదొక టెక్నిక్ ఖాతాదారులను టార్గెట్ చేసి కావాలనే డబ్బులు పంపించి పొరపాటున జరిగిన ట్రాన్సాక్షన్ గా నమ్మించి, మన నుండి తిరిగి డబ్బు పొందే క్రమంలో ఖాతా హ్యాక్ చేయబడుతుంది.

కాబట్టి తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఫోన్లను, మెసేజ్ రిక్వెస్ట్ లను, పొరపాటున ఖాతాలో తెలియని వ్యక్తుల నుండి డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అయితే పొరపాటున పడిన డబ్బులు వాపస్ ఇవ్వాలంటే దగ్గర్లో ఉండే పోలీస్ స్టేషన్ కు వచ్చి తీసుకు వెళ్ళమని చెప్పండి.

లేదంటే బ్యాంకుకు వెళ్లి మీ అకౌంట్లో వేస్తాం అకౌంట్ వివరాలు ఇవ్వండి అని చెప్పండి.

లేదంటే మాకు సంబంధం లేదు బ్యాంక్ ఆ ప్రాబ్లం చూసుకుంటుంది అని చెప్పండి.

పొరపాటున కూడా తిరిగి డబ్బులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ట్రాన్స్ ఫర్ చేయకండి.