ఆధార్ అప్డేట్ చేసుకుంటున్నారా.. సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త..!

ఆధార్ కార్డ్( Aadhaar Card ) ను ప్రతి పదేళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకోవడం కంపల్సరీ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో అందరూ సమయం దొరికినప్పుడల్లా తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకుంటున్నారు.సైబర్ నేరగాళ్లు ఇదే మంచి అవకాశం అనుకొని కొత్త తరహా మోసానికి తెర లేపారు.

సైబర్ నేరగాళ్లు( Cyber ​​criminals ) ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలంటూ ఏవైనా ఈ మెయిల్స్ లేదా మెసేజెస్ లాంటివి పంపిస్తే స్పందించకూడదని, ఆధార్ కార్డులకు సంబంధించి ఎలాంటి వివరాలను షేర్ చేయకూడదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

"""/" / ఆధార్ కార్డ్ పొంది పదేళ్లు దాటిన వారు తాజా వివరాలను అప్డేట్ చేసుకోవాలని UIDAI ఇటీవలే కోరింది.

దీంతో సైబర్ నేరగాళ్లు ఆధార్ కార్డులను సులభంగా ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోవచ్చని ఈమెయిల్, వాట్సాప్ లలో మెసేజ్లను పంపిస్తూ.

అప్డేట్ చేయాలంటే డాక్యుమెంట్స్ షేర్ చేయమని చెప్తున్నారు.ఒకవేళ పొరపాటున కూడా డాక్యుమెంట్స్ షేర్ చేస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉందని, ప్రజలు ఆధార్ కార్డు అప్డేట్( Aadhaar Update ) విషయంలో జాగ్రత్తగా ఉండాలని UIDAI హెచ్చరిస్తోంది.

"""/" / ఆధార్ కార్డు విషయంలో తప్పనిసరిగా తీసుకోవాలని జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.

చాలామంది ప్రజలు ఆధార్ కార్డు జిరాక్స్ లను షేర్ చేస్తుంటారు.అపరిచిత వ్యక్తులకు షేర్ చేయడం చాలా ప్రమాదకరం.

ఆధార్ కార్డులో సున్నితమైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి కాబట్టి ఎవరితోనూ పంచుకోకూడదు.కావాలంటే ఆధార్ కార్డు నెంబర్ చివరి 4 అంకెలు మాత్రమే కనిపించేలా ఆధార్ డీటెయిల్స్ బ్లర్ చేసి షేర్ చేయవచ్చు.

సోషల్ మీడియాలో ఆధార్ కార్డును ఎప్పటికీ షేర్ చేయకూడదు అని UIDAI హెచ్చరిస్తోంది.

బాగా నమ్మకం ఉన్న వ్యక్తులు లేదా సంస్థలలో మాత్రమే ఈ ఆధార్ కార్డును షేర్ చేసుకోవాలని తెలిపింది.

ఎవరి ఫోన్ కైనా ఆధార అప్డేట్ చేసుకోమని మెసేజ్ లేదా ఈమెయిల్ వస్తే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని UIDAI తెలిపింది.

ఖలిస్తాన్ మద్ధతుదారులకు కెనడా కోర్ట్ షాక్ .. పోలీసులకు కీలక ఆదేశాలు