ప్రతి రోజు తలస్నానం చేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ నిజాలు మీకోసమే..?

మన చర్మ ఆరోగ్యాన్ని( Skin Health ) సంరక్షించుకోవడానికి ప్రతి రోజు స్నానం చేస్తూ ఉంటాము.

అంతే కాకుండా ప్రతి రోజు స్నానం చేయడం మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన అలవాటుగా మారిపోయింది.

రోజు స్నానం చేయడం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.

కానీ తలస్నానం రోజు చేయడం శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.రోజు తలస్నానం చేయడం తగ్గించుకోవాలని చర్మవ్యాధి నిపుణులు( Dermatologists ) చెబుతున్నారు.

ఎందుకంటే ఇది శరీరానికి హాని కలిగిస్తుంది.ఇంకా చెప్పాలంటే చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం అలవాటు చేసుకున్న వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

"""/" / వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడిగా మారిపోతుంది.రోజు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల గోళ్లు( Nails ) పాడవుతాయి.

అలాగే చర్మం పొడిబారడంతో పాటు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.

స్నానం విషయానికి వస్తే నీటి ఉష్ణోగ్రత కూడా తేడా ఉంటుంది.బయట చల్లగా ఉన్నప్పుడు వేడినీరు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

అయితే ఇది మీ చర్మం పొడి బారడం మరియు దురద( Itching ) కలిగించే అవకాశం కూడా ఉంది.

నీటి ఉష్ణోగ్రత వేడిగా కాకుండా వెచ్చగా ఉంచడానికి ప్రయత్నించాలి.అయితే సామాజిక ఒత్తిడి కారణంగా భారతదేశంలో చాలా మంది ప్రజలు స్నానం చేస్తారు.

మనం రోజు తల స్నానం చేయడం వల్ల నీరు వృధా కావడమే కాకుండా మానసికంగా కూడా హాని కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

"""/" / స్నానం చేసేటప్పుడు నీళ్లలో ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు.

మీరు నీటిలో ఎక్కువ సమయం గడిపినట్లు అయితే అది మీ జుట్టు మరియు చర్మం పై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

మూడు నుంచి ఐదు నిమిషాల పాటు స్నానం చేసి శరీరంలోని కీలక భాగాలపై మాత్రమే దృష్టి పెట్టాలి.

అయితే చర్మంపై ఎక్కువగా సేపు రుద్దడం వల్ల చర్మం దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్.. కృష్ణవంశీ కామెంట్స్ వైరల్!