చిన్న వయసులోనే కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

ప్రస్తుత సమాజంలో వయసుతో పని లేకుండా ఎంతో మంది ప్రజలు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు.

ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారంలో చేసే పొరపాట్ల వల్లే ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు( Knee Pain ), కీళ్ల సమస్యలు సులభంగా దూరమవుతాయని చెబుతున్నారు.

వృద్ధులు, యుక్త వయసులో ఉండే వాళ్లకు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి.

కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే రాగులు, సజ్జలు, జొన్నలు రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే కీళ్ల నొప్పులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడే వాళ్లకు అరటిపండ్లు( Bananas ) దివ్య ఔషధం అని నిపుణులు చెబుతున్నారు.

అరటి పండ్లలో ఉండే పొటాషియం ఎముకల సాంద్రతను పెంచడంతో పాటు అరటి పండులో ఉండే మెగ్నీషియం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలాగే పైనాపిల్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

"""/" / ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు నారింజ పండు( Orange Fruit )ను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.అలాగే పసుపు పాలు( Turmeric Milk ) తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉన్న చేపలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

అంతేకాకుండా పీ నట్ బటర్, బ్లూ బెర్రీలు, రొయ్యలు, గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వైరల్ వీడియో: నన్నే టోల్ ఫీ అడుగుతావా.. బుల్డోజర్ తో ఏకంగా..