నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారా.. అయితే ఈ అలవాట్లు మార్చుకోండి..

ఈ బిజీ లైఫ్ కారణంగా చాలామంది ఎంతో అలసటగా ఉంటారు.నిద్రలేచిన కూడా ఎంతో అలసటగా అనిపిస్తుంది.

అలాగే కళ్ళు మంటలు పుడుతూ పని మీద ఎక్కువగా శ్రద్ధ చూపించలేకపోతు ఉంటారు.

అయితే ఇవన్నీ నిద్రలేమి లక్షణాలు అని చెప్పాలి.అయితే మీరు సరిపోనంత నిద్ర పోవడంలేదని దీనికి అర్థం.

అయితే ప్రతిరోజూ 10 లేదా 11 గంటల మధ్య నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

అదేవిధంగా ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉత్తమమైనది.అయితే సరైన సమయంలో నిద్ర పోకపోతే సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది.

నిద్రలేమి లాంటి సమస్యల వల్ల శరీరం చాలా నీరసంగా మారిపోతుంది.మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్ర ఉండాలి.

మంచి ఆహారం కూడా చాలా ముఖ్యం.మనం తీసుకునే ఆహారం కూడా మన నిద్ర పై ప్రభావం చూపిస్తుంది.

అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారంతో పాటు నిద్ర చాలా అవసరం.అందుకే దాదాపు 8 గంటల వరకు మన శరీరానికి నిద్ర అవసరం.

అయితే నిద్రను పలు అలవాట్లు నాశనం చేస్తూ ఉంటాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి చాలామందికి నిద్రలేమి సమస్య ఎక్కువగా వస్తుంది.ఎందుకంటే చాలామంది ఎక్కువగా స్క్రీన్ ను చూస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు.

అయితే ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి సిర్కాడియన్ రిథమ్ ని దెబ్బతిస్తుంది.

"""/"/ అందుకే రాత్రి పూట ఎక్కువగా ఫోన్ చూడకుండా నిద్రపోతే చాలా మంచిది.

అదే విధంగా తిన్న వెంటనే పడుకుంటే  దాని ప్రభావం నిద్రపైనా పడుతుంది.అందుకే తిన్న వెంటనే నిజం పోవడం మంచిది కాదు.

ఎందుకంటే భోజనం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.అందుకే మనం నిద్రపోయే ఎన్నో గంటలకు ముందే ఆహారం తీసుకొని ఉండాలి.

అదేవిధంగా కాఫీ ని ఎక్కువగా తాగడం వల్ల కూడా నిద్రలేమి సమస్యలు వస్తాయి.

ఎందుకంటే ఇందులో కెఫీన్ అధికంగా ఉంటుంది.ఇది నిద్రపోడాన్ని కష్టతరం చేస్తుంది.

అలాగే శరీరానికి సరిపడా సూర్యరశ్మి తగలకపోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది.

అందుకే ఉదయాన్నే సూర్యరష్మి తీసుకోవడం చాలా అవసరం.

స్టార్ యాంకర్ సుమకు స్టేజ్ పై ముద్దు పెట్టిన నటుడు.. అసలేం జరిగిందంటే?