నిలబడి మంచి నీళ్లు తాగుతున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

చాలామంది హడావిడి కారణంగా చాలా త్వరగా ఏదో విధంగా పనులు చేస్తుంటారు.అయితే నీరు మనిషి నుండి మొక్కల వరకు ప్రతి ఒక్కరికి చాలా అవసరం.

నీరు త్రాగకుండా కొన్ని గంటలు మాత్రమే ఉండగలం.కానీ రోజుల తరబడి నీరు( Water ) తాగకపోతే క్రమంగా శరీరంలో అవయవాల పనితీరు మందగించి ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి.

అయితే హడావిడి కారణంగా నీళ్లు చాలామంది నిలబడి తాగుతూ ఉంటారు.చాలా ఇళ్లలో నీరు తాగే విధానం గమనిస్తే ఫ్రిజ్ ల దగ్గర, కుండల దగ్గర నీటిని తీసుకుని అక్కడికక్కడే నిలబడి తాగుతూ ఉంటారు.

"""/" / కానీ ఆయుర్వేదం లో మాత్రం ఇలా నిలబడి నీళ్లు తాగడం మహా చెడ్డ అలవాటుగా చెబుతున్నారు.

అయితే ఆయుర్వేదం ప్రకారం నీరు తీసుకోవడంలో చాలా రూల్స్ ఉన్నాయి.అయితే నిలబడి నీరు తాగడం వలన ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఒక్క రోజులో 7 నుండి 8 గ్లాసులు నీళ్లు తాగాలి.

ఇంతకంటే తక్కువ నీళ్లు తాగితే శరీరం హైడ్రేట్ కి లోనవుతుంది.శరీరంలో నీటి కొరత వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.

చాలామంది వాతావరణాన్ని అనుసరించి నీటిని కూడా మారుస్తుంటారు.వేసవిలో చల్లని నీరు, చలికాలంలో వెచ్చగా ఉన్న నీరు తాగుతారు.

కానీ ఏడాది పొడవు ఉన్న గోరువెచ్చని నీరు( Warm Water ) తాగడం వలన శ్రేయస్కారమని ఆయుర్వేదం చెబుతోంది.

చల్లని నీరు తాగడం వలన ఎముకలకు చాలా నష్టం జరుగుతుంది.అదే గోరు వెచ్చని నీరు శరీరాన్ని సమర్థవంతంగా డీటాక్సీపై చేస్తుంది.

"""/" / అలాగే జీవక్రియను కూడా పెంచుతుంది.ఫ్రిజ్ నుండి బాటిల్ తీసుకొని అక్కడికక్కడే నిలబడి తాగుతారు.

కానీ ఆరోగ్యానికి ఈ పద్ధతి పూర్తిగా విరుద్ధం.నిలబడి నీరు తాగడం వలన శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది.

ఇది కీళ్లనొప్పులు, జీర్ణ సమస్యలు, అవయాల పైన ఒత్తిడి, లాంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది.

ఒకేసారి నీళ్లు మొత్తం తాగకూడదు.నీరు తాగడం మొదలు పెట్టారంటే ఒక్కొక్క గ్లాసు కొద్దికొద్దిగా తాగాలి.

కానీ ఒకేసారి ఎక్కువ మొత్తం నీరు తాగడం వలన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

ఇలా తాగడం వలన శరీరంలో అవయవాల మీద ఒత్తిడి పెరుగుతుంది.కాబట్టి కూర్చొని కొద్దికొద్దిగా నీటిని తాగడం చాలా మంచిది.

పనిచేస్తున్న కంపెనీలోనే చోరీ .. ఆపై వేరొకరికి విక్రయం, భారత సంతతి డ్రైవర్‌కు 30 ఏళ్ల జైలు