కలలో చనిపోయిన పూర్వీకులు కనిపిస్తున్నారా.. అయితే దాని అర్థం..
TeluguStop.com
చాలామంది ప్రజలకు నిద్రలో కొన్ని రకాల కలలు వస్తూ ఉంటాయి.కానీ నిద్రలో వచ్చే ప్రతి కలకి ఒక అర్థం అనేది ఉంటుంది.
నిద్రలో వచ్చే కలలు భవిష్యత్తులో మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా అనేవి చెబుతున్నాయి.
కొంతమందికి ఈ రోజు కలలు వస్తూ ఉంటాయి.అయితే కలలో ఎప్పుడైనా మీరు చనిపోయిన పూర్వీకులను చూశారా.
ఇలా చనిపోయిన వారు కలలో కనిపిస్తే వారు మీకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది.
అలాంటి కలలను అసలు తేలికగా తీసుకోవద్దని కూడా శాస్త్రం చెబుతుంది.హిందూ మతంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
పితృపక్షం భద్రపదా మాసం పౌర్ణమి రోజు ప్రారంభమై అశ్విని మాసం అమావాస్యతో ముగుస్తుంది.
ఈరోజుల్లో చనిపోయిన పూర్వీకులకు శ్రద్ధ బలి తరఫున పిండ ప్రధానం చేస్తుంటారు.పితృదేవతలు పితృ లోకం నుంచి భూమికి వస్తారని చాలామంది ప్రజలు నమ్ముతారు.
పితృపక్షం రోజుల్లో కలలో పూర్వీకులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని పండితులు చెబుతున్నారు. """/"/
పూర్వికులు కలలో వస్తుంటే పూర్వీకుల ఆత్మలను శాంతింప చేయడానికి కర్మలు చేయడం మంచిది.
వారి తీరని కోరికలు ఏమైనా ఉంటే వాటిని నెరవేర్చడం మంచిది.సంతోషంగా ఉన్నట్లు నవ్వుతూ కనిపిస్తే వారు మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారని అర్థం చేసుకోవచ్చు.
మీ పూర్వీకులు ప్రశాంతంగా కనిపిస్తే వారు మి పట్ల సంతోషంగా ఉన్నారని త్వరలో కొన్ని శుభవార్తలు వింటారని అనుకోవచ్చు.
చేతులు దగ్గరికి చాచి కలలో మీ పూర్వికులు కనిపిస్తే వారు మీకోసం ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు.
"""/"/
పూర్వికులు మీ ఇంట్లోని దక్షిణ మూలలో నిలబడి కనిపిస్తే మి పై శత్రువులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.
పూర్వికులు కలలో మీ తల దగ్గర నిలబడి ఉంటే త్వరలో మీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.
కాళ్ల దగ్గర నిలబడి ఉంటే త్వరలో ఏదైనా సమస్య ఎదుర్కొంటారని అర్థం చేసుకోవాలి.
2026 సంవత్సరంలో చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ ఫైట్.. పైచేయి సాధించేది ఎవరో?