24 గంటల కరెంట్ పై కేటీఆర్‎ను ప్రశ్నిస్తున్నా..: ఎంపీ కోమటిరెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్రంలో ఎక్కడా రైతులకు 24 గంటల కరెంట్ అందడం లేదన్నారు.

బండ సోమవారం సబ్ స్టేషన్ బుక్ లో అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు.

బీఆర్ఎస్ వాళ్లు పని లేక ధర్నాలు చేశారని మండిపడ్డారు.పది లేదా పదకొండు గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వడం లేదని తెలిపారు.

మధ్యలో కూడా పవర్ కట్ అవుతోందని చెప్పారు.24 గంటలు కరెంట్ అంటున్న కేటీఆర్ ను బండసోమవారం సబ్ స్టేషన్ నుంచే ప్రశ్నిస్తున్నానని తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.