మీ ఇంట్లో ఈశాన్యంలో ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే వెంటనే..?
TeluguStop.com
ఇంట్లో ఈశాన్యం మూలకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వాస్తు శాస్త్రంలో ఈశాన్యం దిశకు పెద్దపీట వేశారు.అందుకే ఈ దిశలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతుంటారు.
ఈశాన్యం( Northeast ) దిశ ధనలక్ష్మి స్థానంగా చెబుతారు.అందుకే ఈ దిశలో వాస్తు పరంగా ఎలాంటి పొరపాట్లు చేయకూడదని సూచిస్తారు.
ఇంతకీ ఈశాన్య దిశలో ఎలాంటి వాస్తు పద్ధతులను పాటించాలి.లోపాలు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
? ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ఉత్తర దిశలో డోర్ ఉండేలా చూసుకోవాలి.
ఇలా ఉంటే ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు ఎక్కువవుతాయి.ఈశాన్య, ఉత్తర దిశలో డోర్ ఉంటే మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు.
దీని వలన మంచి పేరు, ప్రతిష్టలతో పాటు ధన ప్రాప్తి లభిస్తుంది.ఈశాన్యం దిశలో నీటి నిల్వ ఉండేలా చూసుకోవాలి.
అందుకే ఈశాన్య దిశలో బోర్ లేదా పంపునీ ఏర్పాటు చేసుకుంటే డబ్బుతో పాటు శాంతి లభిస్తుంది.
ఈశాన్యంలో పూజ గది( Puja Room ) ఉండేలా చూసుకోవాలి.అలాగే దేవుడు చిత్రపటాలు కూడా ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
"""/" /
ఈ దిశలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా బరువులు లేకుండా చూసుకోవాలి.
ఈ దిశలో స్థలం ఎక్కువగా ఉంటే శుభం కలుగుతుంది.అలాగే సానుకూల శక్తి కూడా పెరుగుతుంది.
అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వైపు టాయిలెట్ ( Toilet )లేకుండా చూసుకోవాలి.
ఇది చాలా పెద్ద వాస్తు దోషం అవుతుందని పండితులు చెబుతున్నారు.ఈశాన్యంలో మరుగుదొడ్లు ఉంటే ఇంట్లో వారు నిత్యం అనారోగ్యం బారిన పడతారు.
ఈశాన్య దిశలో మెట్ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు.అలాగే ఆ వైపు బెడ్ రూమ్ నిర్మాణం కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు.
రైలు పక్కనే ఈ యువతి ఎలా పరిగెత్తిందో.. చూస్తే షాకవుతారు!