దీపారాధన సమయంలో పొరపాటున ఈ తప్పులు చేస్తున్నారా?
TeluguStop.com
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం నిత్యం దీపారాధన చేయడం ఎంతో సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారం.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి దేవతలను నమస్కరిస్తున్నారు.అయితే ఈ దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాము.
ఈ విధమైన పొరపాట్లు చేయటం వల్ల దేవతల అనుగ్రహం కలగడం ఏమో గాని వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.
ఈ విధంగా ప్రతి రోజు దేవుడికి దీపం పెట్టడం ద్వారా మనలో ఉన్న అహంకారాన్ని దహించి వేసి ఆ దేవుని కృపతో జ్ఞానం పొందుతున్నామని చెప్పడమే ఈ దీపారాధన ముఖ్య ఉద్దేశం.
దీపారాధన చేసేటప్పుడు చాలామంది ప్రమిదల్లో వత్తులు వేసి తరువాత నూనెను పోసి దీపం వెలిగిస్తారు.
అయితే పొరపాటున ఈ విధమైనటువంటి తప్పు చేయకూడదు.ముందుగా నూనె పోసిన తరువాతే ఒత్తులు వేయాలని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా కొందరు వారంలో వారికి ఎంతో పవిత్రమైన రోజున మాత్రమే దీపపు ప్రమిదలను శుభ్రం చేసి మిగిలిన రోజులన్నీ యదావిధిగా దీపం వెలిగిస్తారు.
అయితే ప్రతి రోజు దీపం వెలిగించే సమయంలో దీపపు ప్రమిదలను శుభ్రం చేసుకోవాలి.
చాలా మంది దీపం వెలిగించే సమయంలో ప్రమిద కింద ఎటువంటి ఆధారం లేకుండా దీపం వెలిగిస్తారు.
"""/" /
అయితే ఆధారం లేకుండా దీపం వెలిగించకూడదు.ఈ విధంగా దీపపు ప్రమిద కింద ఆధారం పెడితే మన జీవితంలో కూడా ఆ భగవంతుడు మనకి ఆధారం కల్పిస్తాడు.
ఇకపోతే ప్రతి ఒక్కరు చేసే పెద్ద పొరపాటు ఇది దీపపు ప్రమిదలను నేరుగా అగ్గిపుల్లలతో వెలిగిస్తారు అయితే దీపం వెలిగించేటప్పుడు కొవ్వొత్తిని వెలిగించుకొని దీపారాధన చేయాలని పురోహితులు చెబుతున్నారు.
కొవ్వొత్తి తో దీపారాధన వెలిగించి అనంతరం దేవుడికి కర్పూర హారతి ఇవ్వాలి.దీపారాధనకు ముఖ్యంగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి.
దీపారాధన చేసే సమయంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిపై సింధూరం దిద్దుకోవాలి.ఈ విధంగా పూజా సమయంలో తప్పులు చేయకుండా జాగ్రత్త పడి దీపారాధన చేయటం వల్ల ఆ దేవుని అనుగ్రహం మనపై కలుగుతుంది.
ప్రభాస్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు.. తనని ఇప్పటివరకు చూడలేదు: షర్మిల