బీజేపీ తో పొత్తు పెట్టుకుంటున్నారా అంటే ..? లోకేష్ ఆన్సర్ ఇదే 

ప్రస్తుతం ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపద్యం లో, పొత్తుల అంశం కీలకంగా మారింది.

జనసేన, బిజెపి( Janasena, BJP ) ప్రస్తుతం పొత్తు కొనసాగిస్తుండగా, టిడిపి ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తోంది.

ఈ విషయంలో జనసేన సానుకూలంగానే ఉన్నా,  బిజెపి అగ్ర నేతలు మాత్రం టిడిపి తో పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఢిల్లీకి వెళ్లి బిజెపి కీలక నేతలు కొంతమందిని కలిసి,  టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించగా,  అక్కడ సానుకూల స్పందన రాలేదట.

"""/" / కానీ టిడిపి మాత్రం ఎన్నికల సమయం నాటికి బిజెపి పెద్దల మనసు మారవచ్చని , పొత్తు కుదరవచ్చని టిడిపి ఆశల పల్లకిలో ఉంది.

ఈ వ్యవహారం ఇలా ఉండగానే,  ప్రస్తుతం యువ గళం పేరుతో పాదయాత్ర చేస్తున్న లోకేష్ కు ఈ పొత్తుల అంశంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.

ముస్లింలకు అనుబంధంగా ఉండే దూదేకుల సామాజిక వర్గం నేతలు బీజేపీ తో పొత్తు అంశంపై ప్రశ్నించారు.

"""/" / రాబోయే ఎన్నికల్లో బిజెపితో , టిడిపి పొత్తు పెట్టుకుంటుందా లేదా ? పొత్తు పెట్టుకుంటే తాము ఓట్లు వేయాలా లేదా అనే ప్రశ్నలు దూదేకుల సామాజిక వర్గం నేతల నుంచి నారా లోకేష్( Nara Lokesh ) కు ఎదురయ్యాయి.

ఈ ప్రశ్నలపై స్పందించిన లోకేష్ గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి టిడిపి మద్దతు ఇచ్చినా, ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది కలుగ లేదని అన్నారు.

అలాగే ఈసారి కూడా బిజెపితో పొత్తు పెట్టుకున్నా , ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని లోకేష్ సమాధానం ఇచ్చారు.

"""/" / 2014 లో బిజెపి తో టిడిపి పొత్తు పెట్టుకున్నా.ముస్లిం లకు రంజాన్ తోఫా ఇవ్వలేదా అని లోకేష్ ప్రశ్నించారు.

అలాగే ముస్లిం లకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆడుకోలదా అని అన్నారు.

అలాగే బీజేపీ తో పొత్తు ఉన్న సమయంలోనే నాగుల్ మీరా ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన విషయాన్ని కూడా లోకేష్ గుర్తు చేసే ప్రయత్నం చేశారు.

మొత్తంగా బీజేపీ తో టీడీపీ పొత్తు పెట్టుకునేందుకు  ఆసక్తి చూపిస్తోంది అనే సంకేతాలు లోకేష్ ఇచ్చారు.

మరో మూవీని మిస్ చేసుకున్న శ్రద్ధా కపూర్.. ఈ హీరోయిన్ వెళ్తున్న రూట్ రైటేనా?