ఉదయాన్నే ఫోన్ చూస్తున్నారా..? అయితే జాగ్రత్త..!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో చాలామంది ఉదయాన్నే లేవగానే వెంటనే మొట్టమొదటిగా చేసే పని ఫోన్ చూడటం.
కళ్ళు తెరవగానే ప్రతి ఒక్కరు కూడా చేతుల్లోకి మొబైల్ ఫోన్ తీసుకొని స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు.
ఇలా స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రతిదీ కూడా దానిపై ఆధారపడడం అందుకు ముఖ్య కారణం అని చెప్పవచ్చు.
అయితే కుటుంబం, స్నేహితులు, కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడానికి మొదలు జిపిఎస్ ద్వారా అడ్రస్ కనుగొనడం వరకు అన్ని పనులకు స్మార్ట్ ఫోన్ మాత్రమే ఉపయోగిస్తున్నారు.
దీంతో స్మార్ట్ ఫోన్( Smart Phone ) లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు.
"""/" /
అయితే నిజానికి ఫోన్లు అధికంగా వినియోగించడం మనసు పై తీవ్ర ప్రతికూలత ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఓ అధ్యయనం ప్రకారం 80 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మొబైల్ ఫోన్ను తనిఖీ చేస్తున్నారని తేలింది.
అయితే ఇలా నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్ చూడడం వలన చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయం లేవగానే ఫోన్ చూడడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది.
అలాగే ఫోన్ కు వచ్చిన కొత్త మెసేజ్లు, ఈమెయిలు, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అప్డేట్లు ఇవన్నీ ఒత్తిడి( Stress )ని ఆందోళనను కలిగిస్తాయి.
"""/" /
అలాగే ప్రశాంతమైన జీవనశైలికి అంతరాయం కూడా కలిగిస్తాయి.అంతేకాకుండా నిద్ర లేవగానే ఫోన్ చూడడం వలన మనసులో ప్రతికూలతలు పెరిగిపోయి రోజంతా ఆ ప్రభావం కనిపిస్తుంది.
అలాగే యువతలో నిద్రలేమి( Insomnia ), డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా వస్తాయి.
నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడడం వలన మనసు చెదిరిపోవడమే కాకుండా మిగిలిన రోజంతా పరధ్యానానికి టోన్ సెట్ చేస్తుంది.
అయితే ఈ ప్రభావం మానసిక స్థితి పైన ప్రతికూలంగా ఉంటుంది.అలాగే కంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
అడవిలో ఊహించని ఘోరం.. తండ్రీకొడుకులను చంపేసిన ఎలుగుబంటి.. షాకింగ్ వీడియో వైరల్!