శని దోషంతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే చీమలకి ఆహారం పెట్టండి..!

సాధారణంగా ఎలాంటి కష్టాలకైనా అధిపతి శని భగవానుడేనని భావిస్తూ ఉంటారు.ఎప్పుడు ఏదో ఒక సమస్యను అనుభవిస్తూ ఉంటారు.

లేదా ఆరోగ్య సమస్యలతో( Health Problems ) బాధపడుతూ ఉంటారు.దీంతో శని భగవానుడునీ తిట్టుకుంటూ ఉంటారు.

కానీ రహస్య శాస్త్రాల ప్రకారం శని భగవానుడు చేసినంత మేలు ఏ దేవుడు కూడా చేయడని చెబుతున్నాయి.

అయితే వారి జన్మ తహ శని దోషాలు ఉన్నవారైతే కొంత కాలం పాటు ఆ కష్టాలను కచ్చితంగా అనుభవించాల్సిందేనని కూడా చెబుతున్నారు.

ఎందుకంటే సృష్టికి మొత్తం మూలమైన శివుడే కొంతకాలం పాటు శని భగవానుడు ఆవహిస్తాడని దాక్కున్న సమయాలు కూడా ఉన్నాయి.

ఆయనతో పోలిస్తే మనం ఎంత చీమెంత.అయినా కానీ ఎటువంటి శని దోషాలను తొలగించడానికి కూడా కొన్ని రకాల నివారణలు, రహస్య శాస్త్రాలు చెబుతున్నాయి అని పండితులు చెబుతున్నారు.

అది ఏంటంటే కొన్ని రకాల ఆహారాలను చీమలకు వేయడం వలన మనిషికి ఉన్న శని దోషాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి.

అలాగే శనిపీడ తొందరగా తొలుగుతుందని కూడా పండితులు సూచిస్తున్నారు.మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా దీనికోసం 100 గ్రాముల ఎండు ఖర్జూరం, 100 గ్రాముల చక్కెర, 100 గ్రాముల ఎండు కొబ్బరి పొడి తీసుకొని అన్ని కలిపి మిక్సీ పట్టి మెత్తని మిశ్రమంలో తయారు చేసుకోవాలి.

"""/" / అయితే ఎవరైతే శని దోషాలతో( Shani Dosham ) బాధపడుతున్నారో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతిన్నవారు ఉన్నారో వారు ఈ పొడిని రోజు ఉదయం లేవగానే చీమలకు ఆహారంగా పెట్టాలి.

అలాగే వారు తినే మొదటి ముద్దను తీసి కాకికి ఆహారంగా పెట్టడం వలన కూడా శని దోషాలు తొందరగా తొలగిపోతాయి.

ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగ అభివృద్ధి వ్యాపారంలో రాణించాలనుకుంటే శని దోషాలకు, శని గ్రహ పూజలు నిర్వహించడం చాలా ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చు.

"""/" / ఇక మరి ముఖ్యంగా ఈ పూజను శని త్రయోదశి( Shani Trayodashi ) నాడు ఆచరించడం వలన అద్భుతమైన ఫలితాలు కూడా లభిస్తాయి.

ఇక వ్యాపారం చేసే స్థలంలో వ్యాపార వృద్ధి కోసం మొదటిగా ఒక ఎర్రటి గుడ్డలో 11 యాలకులు, 11 ఎండుమిర్చి, నిమ్మ పండు వేసి గుమ్మానికి వేలాడదీయాలి.

ఇలా చేయడం వలన ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి.అలాగే వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది.

ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే శని దోషాలు తొలగించడానికి ఈ చిట్కాలను పాటించి చూడండి.