Shivatmika : జిమ్ కి వెళ్తున్నారా ఎక్స్పోజ్ చేయడానికి వెళ్తున్నారా.. నటి శివాత్మికపై నెటిజన్స్ ట్రోల్స్?

ఈ మధ్య సెలబ్రిటీలు ఒకరిని చూసి ఒకరు మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం జిమ్ముల వైపు తెగ పయనం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అక్కడ చేసే వర్కౌట్ లకు సంబంధించిన ఫోటోలు కూడా పెడుతూ బాగా షో చేస్తున్నారు.

ఇక వాళ్ళు వెళ్లి అక్కడ వర్కౌట్లు చేస్తారో లేక ఫోటోలు దిగుతారో అనేది మాత్రం తెలియదు కానీ తెగ ఫోటోలు మాత్రం పంచుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా శివాత్మిక( Shivatmika ) కూడా జిమ్ములో ఉన్న ఫొటోస్ పంచుకోగా జనాలు ఆమెపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రాజశేఖర్( Rajasekhar ) చిన్న కూతురు శివాత్మిక గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అని చెప్పాలి.

ఈమె తొలిసారిగా దొరసాని సినిమాతో తెలుగు వారికి పరిచయమయ్యింది.అచ్చం తల్లి లాగా ఉండే ఈమెను చూసి జనాలు జూనియర్ జీవిత అంటూ ముద్దుగా పిలుస్తూ ఉంటారు.

అయితే తొలి సినిమా లో తన నటన బాగున్నప్పటికీ కూడా ఆ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.

ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ కొంతవరకు మాత్రమే గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఆ మధ్య విడుదలైన రంగమార్తాండ( Rangamarthanda ) సినిమాలో అద్భుతంగా పర్ఫామెన్స్ చేసింది.

ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో కూడా అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు బాగా పంచుకుంటూ ఉంటుంది.

కొన్ని రోజుల నుండి ఈమె కూడా అందాలను ఆరబోయటం మొదలుపెట్టింది. """/" / మెల్లిమెల్లిగా అందాలను బయటపెడుతూ వస్తుంది.

ఒకప్పుడు తన తల్లిదండ్రులతో ఏదైనా ప్రోగ్రాంలో పాల్గొంటే చాలు చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉండేవాళ్ళు.

ఇప్పటికీ కూడా పబ్లిక్ ప్లేస్ లో చీరలతో, లంగా వోణీలతో దర్శనమిస్తూ ఉంటారు.

శివాని కూడా ప్రస్తుతం హీరోయిన్గా కొనసాగుతుంది.ఇక వీరిద్దరి పద్ధతిగా ఉండటంతో రాజశేఖర్ కూతుర్లు అంటే అందరికీ చాలా అభిమానం చూపిస్తూ ఉండేవాళ్లు జనాలు.

"""/" / కానీ వీరిద్దరూ తమ తల్లిదండ్రులు అందుకున్నంత గుర్తింపును తెచ్చుకోలేకపోవటంతో.వాళ్ల లాగా స్టార్ హోదా తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నారు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూనే ఉన్నారు.ఇక కొంతవరకు శివాత్మిక అవకాశాలు బాగానే అందుకుంటుందని చెప్పాలి.

అంతేకాకుండా మంచి స్ట్రక్చర్ సొంతం చేసుకోవడానికి జిమ్ముకి కూడా పయనం అవుతుంది.అప్పుడప్పుడు అక్కడ దిగే ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.

అయితే తాజాగా స్టోరీ రూపంలో జిమ్ములో ఉన్న వీడియో షేర్ చేసుకుంది.ఇక అందులో తనతో పాటు తన అక్క శివాని, మరో అమ్మాయి కూడా ఉండగా.

ఆ ముగ్గురువర్కౌట్ చేసే పని పక్కకు పెట్టి.శివాత్మిక తీస్తున్న వీడియోకు ఎక్స్పోజ్ చేస్తూ కనిపించారు.

దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలలో వైరల్ అవ్వగా.జిమ్ కి వెళ్తున్నారా ఎక్స్పోజ్ చేయడానికి వెళ్తున్నారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

వైట్‌హౌస్‌కు ఏడాదిగా పార్కిన్సన్ స్పెషలిస్ట్ ఎందుకొస్తున్నట్లు .. అమెరికా రాజకీయాల్లో దుమారం