పొత్తుల పై సేనాని పెదవి విప్పబోతున్నారా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సైలెంట్ గానే ఉన్నారు.పొత్తుల విషయంలో ఏ క్లారిటీ ఇవ్వడం లేదు.

ప్రస్తుతం బిజెపి, జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది.అయితే ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో పవన్ ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

దీనికి తగ్గట్లుగానే ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను చీలనిచ్చేది లేదు అంటూ గతంలోనే పవన్ ప్రకటించారు.

ఈ ప్రకటన తర్వాత టిడిపి , జనసేనతో పొత్తులపై ఆశలు పెంచుకుంది.కానీ పవన్ మాత్రం పొత్తుల విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో,  టిడిపి డైలమాలు పడింది.

అంతేకాకుండా కొన్నికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది.ఇదిలా ఉంటే ఈనెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించబోతున్నారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. """/" / ఈ సభ ఏర్పాటు కంటే రెండు రోజులు ముందుగానే పవన్ కళ్యాణ్ అమరావతి చేరుకుంటారు.

అక్కడ పార్టీ నేతలతో అనేక అంశాలపై విస్తృతంగా మంతనాలు చేస్తారు.ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఏవిధంగా ముందుకు వెళ్ళాలి ?  పొత్తులపై ఏ విధమైన ప్రకటన చేయాలి అనే విషయంలో పార్టీ కీలక నాయకుల సలహాలు,  సూచనలను పవన్ తీసుకోబోతున్నారట.

ఇక మచిలీపట్నంలో నిర్వహించే ఆవిర్భావ సభలో పార్టీ పరంగా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించడంతోపాటు,  పొత్తుల పైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రస్తుతం బిజెపితో పొత్తు ఉన్నా.జనసేన దూరంగానే ఉంటున్న నేపథ్యంలో  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా ఆ పార్టీ నాయకులంతా తాము రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తూ వస్తున్నారు.

దీనిపైన పవన్ ఆవిర్భావ సభలో ఒక క్లారిటీ అవకాశం కనిపిస్తోంది. """/" / ఈ పొత్తు పై ప్రకటన  చేయడం ద్వారా,  బిజెపి తమతో కలిసి వస్తే సరే , లేకపోతే తమదారి తాము చూసుకుంటామనే సంకేతాలను పవన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం ఈ పొత్తులు వ్యవహారం పైనే జనసైనికులలోనూ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.దీనిపై ఒక క్లారిటీ పవన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.

డాకు మహారాజ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చేదెవరు.. ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుందా?