ఆ వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకునే ఆమెకు రేవంత్ టికెట్ ఇస్తున్నారా..?

ఆ వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకునే ఆమెకు రేవంత్ టికెట్ ఇస్తున్నారా?

హుజురాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ జెండా ఎగురవేయాల్సిందేనని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నది.

ఆ వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకునే ఆమెకు రేవంత్ టికెట్ ఇస్తున్నారా?

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ స్కీమ్‌ను పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్‌లో ప్రారంభిస్తున్నారు.

ఆ వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకునే ఆమెకు రేవంత్ టికెట్ ఇస్తున్నారా?

ఇకపోతే ఇక్కడ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ తరఫున నిలబడే అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించారు.

విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ తరఫున పోటీలో ఉండగా, బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడబోయే అభ్యర్థి ఎవరు? అనే విషయమై కొద్ది రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.

అభ్యర్థిగా ఎవరిని నిలపాలనే విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

పీసీసీ కార్యవర్గ సమావేశంలోనూ ఈ విషయమై చర్చించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నేత కొండా సురేఖను ఫైనల్ చేసినట్లు సమాచారం.

త్వరలో అభ్యర్థిగా కొండా సురేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

అయితే, కొండా సురేఖ వైపునకు మొగ్గు చూపడానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖను ఎంపిక చేశారట.

"""/"/ సురేఖ సామాజిక వర్గం పద్మశాలి కాగా, ఆమె భర్త మురళిది మున్నూరు కాపు సామాజిక వర్గం.

ఈ నేపథ్యంలో హస్తం పార్టీకి బీసీ సామాజిక వర్గం ఓట్లు దక్కుతాయని భావించారట టీపీసీసీ నేతలు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఉనికిని హుజురాబాద్‌లో కొండా సురేఖ నిలపగలదని రేవంత్ అభిప్రాయపడ్డారట.

అయితే, ఇందుకు కొండా సురేఖను ఒప్పించే బాధ్యత కూడా రేవంత్ తీసుకున్నారని తెలుస్తోంది.