కంటి ఆరోగ్యానికి అండగా ఉండే ఈ ఆహారాలు మీరు తింటున్నారా..?

ఇటీవలి కాలంలో జీవనశైలి మార్పులు, ఆహార‌పు అలవాట్లు, పోష‌కాల కొర‌త‌, ఎక్కువ సమయం మొబైల్, లాప్‌టాప్, లేదా కంప్యూటర్ స్క్రీన్ ఎదుట గడపడం, కాలుష్యం, ధూళి మరియు హార్మోన్ల మార్పుల వ‌ల్ల మ‌న‌లో చాలా మంది వివిధ కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

అయితే కంటి ఆరోగ్యమ‌నేది( Eyes Health ) మన దైనందిన జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

స్పష్టమైన చూపు మన జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుతుంది.ఈ నేప‌థ్యంలోనే కంటి ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం( Almonds ) కంటి ఆరోగ్యానికి అండంగా ఉండే ఆహారాల్లో ఒక‌టి.బాదంలో విట‌మిన్ ఇ మెండుగా ఉంటుంది.

ఇది కంటి రుగ్మతల నుంచి కాపాడుతుంది.అందుకే నిత్యం బ్రేక్ ఫాస్ట్ లో ఐదు నాన‌బెట్టిన బాదం ప‌ప్పుల‌ను తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోండి.

"""/" / కంటి ఆరోగ్యం కోసం చిల‌గ‌డ‌దుంప‌లను( Sweet Potato ) తీసుకోండి.

చిల‌గ‌డ‌దుంప‌ల్లో బీటా-కెరోటిన్ ఉంటుంది.ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది.

రాత్రి చూపు సమస్యలను నివారిస్తుంది.మక్యులార్ డిజనరేషన్ వంటి కంటి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

కంటి ఆరోగ్యానికి పాల‌కూర( Spinach ) కూడా ఎంతో మేలు చేస్తుంది.పాల‌కూరలో ఉండే ల్యూటిన్, జియాక్సాంతిన్ కంటి కణాల‌ను రక్షిస్తాయి.

అందుకోసం పాల‌కూర‌ను క‌ర్రీస్‌, జ్యూస్ లేదా సూప్స్ రూపంలో తీసుకోవ‌చ్చు. """/" / క్యారెట్( Carrot ) కూడా కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంద‌ని మ‌న‌కు తెలుసు.

క్యారెట్ లో విట‌మిన్ ఎ అధిక మొత్తంలో ఉంటుంది.ఇది కంటి కణాలను రక్షించ‌డ‌మే కాకుండా స్పష్టమైన దృష్టిని ప్రోత్స‌హిస్తుంది.

వివిధ కంటి సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ ను త‌గ్గిస్తుంది.కంటి ఆరోగ్యం కోసం కోడిగుడ్లను తీసుకోండి.

కోడిగుడ్లలో ఉండే జియాక్సాంతిన్, ల్యూటిన్ కంటి కండరాల బలానికి ఉపయోగపడతాయి.అంతేకాకుండా రోజుకో క‌ప్పు గ్రీన్ టీ తీసుకోండి.

గ్రీన్ టీ వెయిట్ లాస్ కు మాత్ర‌మే కాదు అందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని ప్ర‌త్స‌హిస్తాయి.

వైరల్ వీడియో: నిల్చొని పనిచేయండి అంటూ ఉద్యోగులకు సీఈవో పనిష్మెంట్..