ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా అన్నం తింటున్నారా..?

సాధారణంగా ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే కాల కృత్యాలు తీర్చుకొని టిఫిన్ చేసి ఎవరి పనులకు వారు వెళ్ళిపోతూ ఉంటారు.

ఈ ఆధునిక ప్రపంచంలో అంటే దాదాపు ప్రతి ఒక్కరు ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉన్నారు.

కానీ కొన్ని సంవత్సరాల క్రితం మన పూర్వీకులు టిఫిన్ చేయకుండా ఉదయం కూడా అన్నం తిని ఎవరి పనులకు వారు వెళ్ళిపోయేవారు.

ఆ సమయంలో అంటే మన పూర్వీకులకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు.కానీ ప్రస్తుత సమాజంలో మాత్రం టిఫిన్ చేయకుండా అన్నం ఎక్కువగా తింటే అధిక బరువు సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

అసలు ఉదయాన్నే అన్నం తినడం మంచిదా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఉదయం అన్నం తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.కానీ ఉదయం ఎక్కువ మొత్తంలో అన్నం అస్సలు తినకూడదు.

రోజులో మొదటి భోజనంలో అన్నం ఉండడం మంచిదే కానీ అన్నాన్ని ఉదయం పూట ఎక్కువ మొత్తంలో అసలు తినకూడదు.

ఉదయం శరీరం చాలా చురుకుగా ఉంటుంది. """/"/ అందువల్ల చాలా శక్తి అవసరం అవుతుంది.

కాబట్టి తమ బరువును అదుపు చేయాలనుకునేవారు లేదా మధుమేహం ఉన్నవారు ఉదయం పూట అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు.

కానీ అది కూడా తక్కువగా తినడమే మంచిది.లేదని ఉదయం పూట అన్నం ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనిలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ ఆహార పదార్ధమైన తక్కువ మోతదులో తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

ఆరోగ్యానికి ఎంత మేలు చేసే ఆహార పదార్ధమైన ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నా జీవితాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చావు.. మదర్స్ డే ఉపాసన స్పెషల్ పోస్ట్!