Tea Coffee : ప్రతిరోజు మూడు కప్పుల కన్నా ఎక్కువగా టీ, కాఫీలు తాగుతున్నారా..? అయితే ఈ సమస్య తప్పదు..!

మనలో చాలామంది ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలు తాగకపోతే ఎలాంటి పనిని కూడా మొదలుపెట్టలేరు.

అయితే లేచిన వెంటనే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగుతారు.దీంతో వారికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.

అయితే టీ కాఫీలలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది.ఇది శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది.

అయితే దీనికి కొంతమంది కప్పుల మీద కప్పులుగా తాగేస్తూ ఉంటారు.అయితే ఇలా తాగడం వలన ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనిలో ఉండే కెఫిన్( Caffeine ) ఆరోగ్యం పై ఎఫెక్ట్ చూపిస్తుంది.కెఫిన్ అధికంగా తీసుకోవడం వలన తొందరగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

"""/" / అయితే కాఫీ ఎక్కువగా తాగడం వలన కడుపులో పుండ్లు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

అయితే ఇది బీపీని పెంచడమే కాకుండా కొన్నిసార్లు గుండె పోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

అలాగే కాల్షియం( Calcium ) గ్రహించే సామర్థ్యాన్ని కూడా కాఫీ తక్కువ చేస్తుంది.

అధికంగా కాఫీ తీసుకోవడం వలన రొమ్ములో చిన్న చిన్న గడ్డలు కూడా వస్తాయి.

కాఫీ వలన శరీరంలో నీరు తగ్గిపోతుంది.ఇది ఆరోగ్యానికి, జుట్టుకి, చర్మానికి హాని కలిగిస్తుంది.

అయితే ఎక్కువ మోతాదులో టీ, కాఫీలు తీసుకోవడం వలన ఏకాగ్రతను, ఆలోచన శక్తిని కోల్పోతాము.

"""/" / దీంతో ఉదర సమస్యలు వస్తాయి.కొంతమందికి తరచుగా కడుపునొప్పి వస్తూ ఉంటుంది.

దీంతో మళ్ళీ మళ్ళీ బాత్రూంకి వెళుతూ ఉంటారు.ఇక నిద్రలేమి సమస్య కూడా కచ్చితంగా కాఫీలు, టీలు ఎక్కువగా తాగడం వలన వస్తుంది.

అలాంటివారు కాఫీకి దూరంగా ఉండడమే మంచిది.అలాగే కాఫీ అధికంగా తీసుకోవడం వలన డిప్రెషన్ కి లోనవుతారు.

కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వలన శరీరం లో చెడు కొలెస్ట్రాల్( Bad Cholesterol ) కూడా పెరిగిపోతుంది.

కాబట్టి టీ, కాఫీ లను మితంగానే తీసుకోవాలి.

ఇప్పటి హీరోయిన్స్ లలో సాయి పల్లవి కి మాత్రమే ఈ ఘనత దక్కింది