టాటూ తో ఈ డిజైన్లు వేయించుకుంటున్నారా..అయితే జాగ్రత్త..!

ప్రస్తుత సమాజం లో ఎన్నో రకాల ఫ్యాషన్ లను యువత ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉన్నారు.

కానీ ఈ ఫ్యాషన్ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది.అది ఎప్పుడు ఎలాంటి రూపాన్ని దాలుస్తుందో అసలు చెప్పలేము.

పచ్చబొట్టును ఒకప్పుడు ట్రైబల్ ఆర్ట్( Tribal Art ) గా పరిగణించేవారు.కానీ ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత దీన్ని అనుసరిస్తున్నారు.

పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అంతా పచ్చబొట్లు వేసుకుంటున్నారు.రకరకాల డిజైన్లు సృజనాత్మకంగా శరీరం మీద టాటుగా వేసుకోవడానికి చాలామంది ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

అతి పురాతనమైన ఈ కల గురించి దీనిలో ఉపయోగించే డిజైన్ల గురించి శాస్త్రం కొన్ని నియమాలను కూడా చెబుతోంది.

కొన్ని రకాల టాటూ డిజైన్లను( Tattoo Designs ) ఎప్పటికీ శరీరం మీద వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.

పచ్చబొట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పగిలిన అద్దం డిజైన్ అసలు శరీరం మీద వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.

పగిలిన అద్దం దురదృష్టానికి సంకేతం.పగిలిన అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు.

"""/" / ఇలాంటి చిహ్నాన్ని శరీరం మీద వేసుకోవడం అశుభంగా చెబుతున్నారు.ఇది జీవితంలోకి ప్రతికూలతను వచ్చేలా చేస్తుంది.

ఇటువంటి టాటూలు శరీరం మీద వేసుకున్న వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన, వ్యాపార సంబంధ సమస్యలు( Business Issues ) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇంకా చెప్పాలంటే గుర్రపు డెక్క గుర్తు అదృష్టానికి సంకేతం.అయితే ఇది తిరగబడిన విధంగా టాటూ వేసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయి.

ఇలా తిరగబడిన గుర్రపు డెక్క డిజైన్( Horse Hoof Design ) జీవితంలోని పాజిటివ్ వీటిని హరించే అశుభ సంకేతంగా భావిస్తారు.

"""/" / ఈ డిజైన్ శరీరం మీద వేయించుకుంటే దురదృష్టాన్ని పిలిచినట్లే.ఇంకా చెప్పాలంటే విచారంగా కనిపించే ముఖాలు ప్రతికూల భావనలు కలిగిస్తాయి.

దురదృష్టాన్ని ఆకర్షిస్తాయి.జీవితంలో భావోద్వేలు చాలా ముఖ్యమైనవి.

వాటిని వ్యక్తం చేసే విధంగా మన జీవితాలను ప్రభావితం చేస్తాయి.దుఃఖాన్ని తెలిపే పచ్చబొట్టు డిజైన్లు శరీరం మీద పచ్చబొట్టుగా వేయించుకుంటే జీవితంలో అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది.

అలాగే మనిషి పుర్రె, పిల్లి, గబ్బిలం వంటి టాటూలు శరీరంపై అస్సలు ఉండకూడదు.

కింగ్ చార్లెస్ 2025 న్యూ ఇయర్ ఆనర్స్ లిస్ట్‌ .. 30 మంది భారతీయ ప్రముఖులకు చోటు