హెయిర్ కలరింగ్ చేయిస్తున్నారా.. అయితే ఈ విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోండి..

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు హెయిర్ కలర్( Hair Color ) ట్రెండ్ విపరీతంగా ఫాలో అవుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే వాతావరణంలోని మార్పుల కారణంగా, జీవనశలిలో మార్పు కారణంగా జుట్టు తెల్ల రంగులోకి( White Hair ) మారడం జరుగుతోంది.

కొంత మందిలో జుట్టు గ్రే కలర్ లోకి మారడం ఒక కారణమైతే నచ్చిన కలర్ లో జుట్టును మార్చుకోవడం మరో కారణంగా మారిపోయింది.

అయితే ఈ పని చేసే ముందు హెయిర్ స్టైలిస్ట్ ( Hair Stylist )సలహాలు తప్పకుండా తీసుకోవాలి.

"""/" / మీ జుట్టూ రకం, ఆకృతిని బట్టి హెయిర్ కలరింగ్ చేయించడం మంచిది.

లేకపోతే జుట్టు సమస్యలు ఎదురై జుట్టు అంద హీనంగా తయారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

అంతే కాకుండా జుట్టు కలరింగ్ చేయించుకున్నట్లయితే పాటించాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు జుట్టును తరచుగా స్టైలిష్ చేయించుకోవడం మానుకోవాలి.ముఖ్యంగా స్టైలిష్ టూల్స్ అధికంగా ఉపయోగించడం జుట్టుకు ఎంతో హానికరం.

మీ జుట్టు కు కలర్లు వేయాలనుకుంటే ఎప్పుడూ కూడా హెయిర్ స్టైలిస్ట్ వద్ద వేయించుకోండి.

"""/" / వారు ఈ పనిలో నిపుణులు కాబట్టి మీ జుట్టుకు హాని జరగకుండా ఎంత రసాయనాలు వాడాలో వారికి బాగా తెలుసు.

ముఖ్యంగా చెప్పాలంటే మీరు హెయిర్ కలర్ ని వాడుతుంటే షాంపూలను, కండిషర్లను ఎక్కువగా ఉపయోగించకూడదు.

అయితే హెయిర్ కలర్ లోనీ రసాయనాలు షాంపు లేదా కండిషనర్ లోని రసాయనాలు కలిస్తే మీ జుట్టుకు హాని కలుగుతుంది.

మీరు మీ జుట్టుకు రంగు వేసినట్లయితే కనీసం మూడు రోజులు దానిని కడగకూడదు.

ఈ సమయంలో మీరు వేసుకున్న రంగు మీ జుట్టుకు బాగా సెట్ అవుతుంది.

అంతే కాకుండా రంగు వేసుకున్న వారు ఎప్పుడు చల్లటి నీటితో జుట్టును కడగాలి.

వేడి నీరు లేదా గోరువెచ్చని నీటితో అసలు కడగకూడదు.

నాగార్జున తన కొడుకుల విషయం లో జోక్యం చేసుకోడా..? ప్రస్తుతం అఖిల్ పరిస్థితి ఏంటి..?